జీహెచ్ ఎంసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్లలో కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది. 150 వార్డుల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 30 సెంటర్లలో కలిపి166 కౌంటింగ్ హాల్స్ ను ఎస్ ఈసీ ఏర్పాటు చేసింది. ఒక్కో హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్ సిద్ధం చేసింది. ఒక్కో రౌండ్‌కి 14,000 ఓట్లను లెక్కిస్తారు. మూడు రౌండ్లలోనే పూర్తి ఫలితం వెలువడనుంది.
ఇక, గ్రేటర్ ఎన్నికల్లో పోలైన ఓట్లను బట్టి చూస్తే ముందుగా మెహిదీపట్నం డివిజన్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొదటి రౌండ్ వివరాల వెల్లడి 11 గంటల తర్వాతే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మెహదీపట్నం డివిజన్ లో మొత్తం 11,818 వేల ఓట్లు పోలయ్యాయి. చాలా వార్డుల్లో 15 నుంచి 27 వేల వరకు ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రెండవ రౌండ్లలో వెలువడే అవకాశం ఉంది.
పోటీలోని క్యాండిండేట్లు ఒక్కో కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక్కో ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. క్యాండిడేట్ లేదా క్యాండిడేట్ తరఫు ఎలక్షన్ ఏజెంట్, అడిషనల్ కౌంటింగ్ ఏజెంట్‌నే కౌంటింగ్ టేబుల్ దగ్గరకు అనుమతిస్తారు. హాల్ లో లెక్కింపు ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరా లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయనున్నారు. ఓట్ల కౌంటింగ్ కు వచ్చే ఏజెంట్లకు రిలీఫ్ ఏజెంట్ ను ఇవ్వబోమని, కౌంటింగ్ హాళ్లలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదని ఎస్ ఈసీ స్పష్టం చేసింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని చెప్పింది. కౌంటింగ్‌లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 2,629 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు. అయితే వాటిలో రేపు ఉదయం 8 గంటలలోపు కౌంటింగ్ సెంటర్‌కు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇదిలా ఉంటే గ్రేటర్‌లోని 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 74,67,256 ఓట్లు ఉండగా 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.