అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24,25వ తేదీల్లో భారత్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో ఢిల్లీ, అహ్మదాబాద్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ నెల 25న విందు ఇస్తున్నారు. ఈ విందుకోసం ఈ విందుకు దేశంలోని 8 మంది ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉండడం విశేషం.
ట్రంప్ తో విందులో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. మొత్తం 95మందిని మాత్రమే ఈ విందుకు ఆహ్వానించినట్టు తెలిసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఒడిషా, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది.
మొదట 24న అహ్మదాబాద్ చేరుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలుకుతారు. అనంతరం మోడీ , ట్రంప్ కలిసి మొతేరా స్టేడియానికి ర్యాలీగా వస్తారు. లక్షల మంది జనం ఇరువైపులా వీరికి స్వాగతం పలుకుతారు. మోతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ సభలో ట్రంప్ ప్రసంగిస్తారు. ఇందుకోసం గుజరాత్ సర్కారు 100 కోట్లు ఖర్చు చేస్తోంది.
24న మధ్యాహ్నం ఈ కార్యక్రమం ముగిశాక ట్రంప్ దంపతులు ఆగ్రా వెళతారు. మరుసటి రోజు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి భేటి, విందు ఏర్పాటు చేశారు. రాజ్ ఘాట్ లో గాంధీకి నివాళులర్పిస్తారు. రాత్రికి విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మోడీ-ట్రంప్ అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు భాగస్వామ్యం దక్కడం విశేషంగా మారింది. కాగా ఏపీ సీఎం జగన్ ఈ విందులో పాల్గొనడం సందేహం గా మారింది. ఆయనకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.