రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపులో విశేషాలకు కొదవ లేదు

Update: 2022-07-22 05:12 GMT
అంచనాలకు తగ్గట్లే రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీషాలు డిసైడ్ చేసిన ద్రౌపది ముర్ము విజయం సాధించారు. అధికారపక్షానికి స్పష్టమైన అధిక్యత ఉండటం.. విపక్షాలు అంత బలంగా లేకపోవటంతో.. ఒక మోస్తరు పోటీనే ఇద్దరి మధ్య జరిగింది.

షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లు సాగింది. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అధికారికంగా ఫలితాల్ని వెల్లడించారు. ముందు నుంచే అధిక్యత స్పష్టంగా ఉండటంతో ఓట్ల లెక్కింపులో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకోలేదు.

కాకుంటే.. కొన్ని సందర్భాల్లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. తొలుత పార్లమెంటు సభ్యులు.. పార్లమెంటులో ఓటు వేసిన ఎమ్మెల్యేల ఓట్లను వేరు చేసి లెక్క వేశారు. తర్వాతి మూడు రౌండ్లలో అక్షర మాల ప్రకారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా చోటు చేసుకన్న పలు విశేషాల్ని చూస్తే..

-  అక్షర క్రమంలో భాగంగా ఏపీ ఓట్లను ముందుగా లెక్క మొదలు పెట్టారు
-  కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ.. పుదుచ్చేరి ఓట్ల లెక్కింపు చివర్లో జరిగింది.
-  ఏపీ.. నాగాలాండ్.. సిక్కిం రాష్ట్రాల్లో యశ్వంత్ సిన్హాకు ఒక్క ఓటు కూడా పడలేదు
-  అదే సమయంలో ద్రౌపదీ ముర్ముకు దేశంలోని అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క ఓటు అయినా పడింది.
-  కేరళలో వంద శాతం ఓట్లు యశ్వంత్ సిన్హాకు పడతాయని భావించినా.. ద్రౌపదికి ఒక ఓటు లభించింది.
-  విపక్షాలకు చెందిన 17 మంది ఎంపీలు.. 125 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి.. ద్రౌపదికి అనుకూలంగా ఓటేయటం విశేషం.
-  చెల్లని ఓట్లలో పార్లమెంటు సభ్యులవి 15 అయితే.. ఎమ్మెల్యేలవి 38
-  చెల్లని ఓట్లు అత్యధికంగా రాజస్థాన్.. మధ్యప్రదేశ్ లో పడ్డాయి.
-  2017 ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ కు వచ్చిన 65.65 శాతం ఓట్లతో పోలిస్తే ద్రౌపదికి కాస్త తగ్గాయి.
- గత ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన మీరా కుమార్ తో పోలిస్తే యశ్వంత్ సిన్హాకు ఓట్లు పెరిగాయి.
-  ద్రౌపది ముర్ముకు అత్యధిక ఓట్లు వచ్చిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్.. మహారాష్ట్ర.. ఆంధ్రప్రదేశ్.. బిహార్.. మధ్యప్రదేశ్.. గుజరాత్ లు ఉన్నాయి.
-  యశ్వంత్ సిన్హాకు అత్యధిక ఓట్లు వచ్చిన రాష్ట్రాలుగా పశ్చిమ బెంగాల్.. తమిళనాడు.. కేరళ.. తెలంగాణ.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్.. పంజాబ్.. ఢిల్లీలో అధికార పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
Tags:    

Similar News