కరోనా కారణంగా కొందరు అధికారుల పేర్లు ప్రజలకు చాలా పాపులర్ అయ్యాయి. మహా సంక్షోభం వేళ.. వారి నుంచి అందే సమాచారంతో పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకునే వీలు ఉండేది. అలా పాపులర్ అయిన కీలక అధికారుల్లో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు. కరోనా మొదటి వేవ్ కంటే కూడా రెండో వేవ్ లో ఆయన ప్రజలకు బాగా పాపులర్ అయ్యారు.
ఎప్పటికప్పుడు కరోనాకు సంబంధించిన కీలక అంశాల మీద ఆయన వివరణ ఇచ్చే వారు. అంతేకాదు.. కరోనా వైద్యానికి సంబంధించిన పలు ఆసుపత్రుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన వేళ.. వాటిపై చర్యలు తీసుకునే విషయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. ముక్కుసూటి వ్యక్తిత్వంతో పాటు.. విషయం ఉన్న ఈ కీలక అధికారి.. బాగా పని చేస్తారన్న పేరుంది. కరోనా వేళ.. ఆయన పడిన శ్రమ పెద్దగా బయటకు రాలేదనే చెబుతారు. కాకుంటే.. ప్రెస్ లో ఎక్కువగా కనిపించటంతో బాగా పాపులర్ అయ్యారు.
తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి.. కరోనా అలెర్టుల్ని చేసే గడల శ్రీనివాస్ రోటీన్ కు భిన్నంగా మాస్కు లేకుండా ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు అడిగితే.. ఆయన నుంచి అనూహ్యమైన సమాధానం రావటం గమనార్హం. ప్రజల్లో చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే తాను మాస్కు పెట్టుకోలేదన్నారు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న వేళలో అందరూ మాస్కులు పెట్టుకున్నారని.. ఇప్పుడు మాత్రం ఇరవై శాతం ప్రజలు కూడా మాస్కులు పెట్టుకోవటం లేదన్నారు. మాస్కు ధరించకపోతే కరనాను నియంత్రించటం కష్టమన్న విషయాన్ని తెలియజేసేందుకే తానీ విధంగా వ్యవహరించినట్లు చెప్పారు. ఇదంతా నిజమేనా? లేదంటే కవర్ చేయటానికి ఇలా చెప్పారా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేయటం గమనార్హం.