బ్రిటన్ యువరాణి డయానా ఆత్మహత్యాయత్నం చేసిందా? తన భర్త ప్రిన్స్ చార్లెస్ అందుకు కారణమా? ఈ విషయాలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో విడుదల కానున్న 'డయానాః హర్ ట్రూ స్టోరీ ఇన్ హర్ వర్డ్స్‌స పుస్తకంలో డయానా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి రానున్నాయి.
డయానా కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమైంది. ఆ ప్రమాదం విషయంలో మీడియా వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ప్రిన్స్ చార్లెస్ తో పెళ్లైన 10 రోజులకే ఆమె ఆత్మహత్యా యత్నం చేసిందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందట. దీనికి కారణం ఆమె భర్త, ఆయన ప్రియురాలు కెమిల్లా అనే విషయం బహిర్గతమైంది.
తాను చాలా ఒత్తిడిలో ఉన్నానని... బ్లేడ్ తో చేతుల మణికట్లు కోసుకునేందుకు ప్రయత్నిస్తున్నానంటూ డయానా తన వాయిస్ ను రికార్డు చేసుకున్నారు. ఈ ఆడియో రికార్డును తన స్నేహితురాలి వద్ద భద్రపరిచారు డయానా. వాటి ఆధారంగా అండ్రూ మోర్టన్ అనే రచయిత 'డయానాః హర్ ట్రూ స్టోరీ ఇన్ హర్ వర్డ్స్' అనే పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు. త్వరలో విడుదల కానున్నఈ పుస్తకంలో డయానాకు సంబంధించిన అనేక ఆసక్తికర వివరాలను పొందుపరిచారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/