కరోనాను కంట్రోల్ చేయటానికి.. మాయదారి వైరస్ వ్యాప్తికి చెక్ చెప్పేందుకు వీలుగా లాక్ డౌన్ ను తెర మీదకు తీసుకొచ్చారు. దేశంలో తొలిసారి లాక్ డౌన్ ను అమల్లోకి తెచ్చిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ముందు నిలిచింది. అంతేకాదు.. కేంద్రం కంటే మరింత కాలాన్ని పొడిగిస్తూ ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారు. లాక్ డౌన్ 2.0 మే మూడున దేశం మొత్తం ముగిస్తే తెలంగాణలో మాత్రం మే ఏడున ముగియనుంది. తెలంగాణలో అమల్లోకి తీసుకొచ్చే లాక్ డౌన్ 3.0 సైతం కేంద్రంలోని మోడీ సర్కారు కంటే మరింత ఎక్కువ కాలం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్రం విధించిన లాక్ డౌన్ 3.0 మే 17న ముగియనుంటే.. తెలంగాణలో మాత్రం ఇరవై తర్వాతే ఉంటుందని చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కట్టుదిట్టమైన పద్దతిలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటివేళ.. ఒక టీవీ చానల్.. తెలంగాణలో లాక్ డౌన్ అమలు ఏ రీతిలో ఉందన్న అంశంపై సర్వేను నిర్వహించింది.
దీని ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. సదరు ఛానల్ లెక్కన చూస్తే.. లాక్ డౌన్ వేళ కేసీఆర్ సర్కారు పని తీరును మెచ్చుకుంటూ ప్రజలు భారీగా మార్కులు వేసేశారు. 84.8 శాతం మంది ప్రభుత్వ పని తీరు అద్భుతం గా ఉందని తేలిస్తే.. 14 శాతం మంది ఫర్లేదని.. 1.2 శాతం మంది మాత్రం బాగోలేదని పెదవి విరిచారు. కరోనా వేళ కేసీఆర్ సర్కారు పని తీరు చాలా బాగుందన్న మాట 66.4 శాతం మంది నోటి నుంచి రాగా.. బాగుందన్న మాట 27.2 శాతం మంది చెప్పగా.. ఫర్లేదన్న మాట 5.8 శాతం మంది చెప్పగా.. బాగోలేదన్న మాటను కేవలం 0.6 శాతం మంది నోటి నుంచి రావటం గమనార్హం. ఈ లెక్కన చూస్తే.. కరోనా వేళ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.