రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ఆయన చెల్లెలు ప్రియాంక వాద్రా కూడా సెల్ఫ్ గోల్స్ స్పెషలిస్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే తన పోటీ విషయంలో ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి డ్యామేజ్ చేశాయి. తనే వారణాసి నుంచి పోటీకి రెడీ అని ప్రకటించిన ప్రియాంక ఆ తర్వాత వెనక్కు తగ్గింది. 'మోడీ మీద పోటీకి సై..' అని ప్రకటించిన ఆమె తర్వాత ఆ విషయంలో వెనక్కు తగ్గి.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు.
తనకు వేరే బాధ్యతలున్నాయని ఆమె అంటున్నారు. మరి ముందుగా పోటీ చేయడానికి రెడీ అని ప్రకటించింది కూడా ఆమే. ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయని అంటున్నదీ ఆమే. అలా ప్రియాంక రెండు రకాలుగా మాట్లాడారు.
ఆ సంగతలా ఉంటే.. తమ పార్టీ వీక్ గా ఉందని ప్రియాంక ఒప్పుకున్నారు. అది యూపీ విషయంలో. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉందని, మరింత వీక్ కావడానికి కూడా రెడీ అన్నట్టుగా ఆమె ప్రకటించారు. అదేమంటే.. తమ లక్ష్యం బీజేపీని ఓడించడమే అని..ఎస్పీ –బీఎస్పీల మీద తమ పార్టీ కావాలని వీక్ క్యాండిడేట్స్ ను బరిలోకి నిలిపిందని ప్రియాంక వ్యాఖ్యానించారు.
ఒకవైపు ప్రియాంక యూపీలో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి రంగంలోకి దిగారు. తమ పార్టీని గెలిపించాలంటూ అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆమె స్వయంగా మాట్లాడుతూ.. యూపీలో తమ పార్టీ బలహీనంగా ఉందని, బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపినట్టుగా ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది!
ఒకవైపు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే.. మరోవైపు ఇలా యూపీలో తమ పార్టీ అభ్యర్థులు బలహీనులు అని ప్రియాంక ప్రకటించుకోవడం మరో సెల్ఫ్ గోల్ లా కనిపిస్తూ ఉంది!