నిజమే.. ప్రియాంకా గాంధీ హైదరాబాద్ కు వచ్చారు. జెడ్ సెక్యూరిటీ రక్షణ ఉన్న ప్రియాంక తన కొడుకు వైద్యం కోసం భాగ్యనగరికి వచ్చి వెంటనే వెళ్లిపోయారు. అయితే.. ఆమె.. ఆమె భర్త కమ్ బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రా కూడా ఆమె వెంట ఉన్నారు. పోలీసు.. ఆసుపత్రి వర్గాలకు తప్పించి మరెవరికీ వారి రాకకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేదు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన కుటుంబ సభ్యులు నేరుగా ఎల్వీ ఆసుపత్రికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గత వారం ప్రియాంకా కుమారుడు రైహన్ వాద్రా కంటికి క్రికెట్ బంతి తగలటంతో తీవ్రగాయమైంది. దీని చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి.. సెకండ్ ఓపీనియన్ కోసం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో.. వారు హైదరాబాద్ కు రావాల్సి వచ్చింది.
ప్రియాంకా ఫ్యామిలీ హైదరాబాద్ కు వస్తున్న విషయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఏనాయకుడికి సమాచారం అందించకపోవటం గమనార్హం. ప్రియాంకా వచ్చారన్న విషయం..ఆమె హైదరాబాద్ లోకి అడుగుపెట్టిన గంట తర్వాత తెలుసుకున్న తెలంగాణ పీసీసీ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నించగా.. సున్నితంగా వారించి వద్దని చెప్పటం గమనార్హం. మధ్యాహ్నానానికి చికిత్స పూర్తి చేసుకున్న వారు తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/