సినీ నటుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగుతున్నాయి. 'నన్ను ఎవరు పిలవలేదు ఏవో చర్చలు జరుగుతున్నాయట. మరి నన్ను ఎందుకు పిలవలేదో తెలీదు. అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారేమో.. మేబి దే ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్' అని బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నిర్మాత సి.కళ్యాణ్ బాలకృష్ణ మాటల్లో అలాంటి ఉద్దేశం ఏది లేదని క్లారిటీ ఇవ్వగా.. బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డారు ప్రముఖ నటుడు నాగబాబు. 'బాలకృష్ణ గారు మీరు మాట్లాడింది చాలా పెద్ద తప్పు మాట. దయచేసి మీరు మీ మాటలను వెనక్కి తీసుకోవాలి. భూములు పంచుకుంటున్నారు అనే మాట చాలా తప్పండి. ఇక్కడ ఎవరు భూములు పంచుకోవడానికి సమావేశానికి హాజరు కాలేదు. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడానికి మాత్రమే వారంతా హాజరయ్యారు. ఇది అందరినీ పిలిచి జరిపే మీటింగ్ కాదు. భూములు పంచుకుంటున్నారు అని మాట్లాడారు.. ఇదేనా మీకు ఇండస్ట్రీ పై ఉన్న గౌరవం.. అంటూ నాగబాబు ప్రశ్నించాడు. అవునండి మిమ్మల్ని పిలవకపోవడం తప్పే.. అనేది నేను కూడా సమర్పిస్తున్నాను. కానీ మిమ్మల్ని పిలవనంత మాత్రాన భూములు పంచుకుంటున్నారు అనడం చాలా పెద్ద తప్పండి. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడడం సరికాదు. నీ మాటలకు పదిరెట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉన్నారు' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా సినీ నిర్మాత ప్రసన్నకుమార్ బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించి ఆశ్చర్యానికి గురి చేశారు. బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలపై.. అలాగే నాగబాబు మాటలపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 'ఫస్ట్ అఫ్ ఆల్ బాలకృష్ణ గారిని పిలవకపోవడం అనేది తప్పే. కానీ అది ప్రైవేటుగా జరిగిన మీటింగ్ కాబట్టి ప్రైవేటుగానే జరిపారు. ఆయనను పిలవలేదు అని చెప్పడంలో బాలకృష్ణ గారిది ఎలాంటి తప్పు లేదు. డెఫినెట్గా బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలో మెయిన్ పిల్లర్. ఏదైనా కూడా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే తెలుగు ఫిలిం ఛాంబర్ హెడ్. ఇండస్ట్రీలో సమస్యల్ని చాంబర్ హెడ్డే పరిష్కరించి అందరి వెనకుండి ముందుకు నడపాలి. నాడు దాసరి నారాయణరావు కూడా అలాగే చేశారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు నన్ను ఎవరు పిలవలేదు అని చెప్పడంలో తప్పులేదు' అంటూ బాలయ్యను వెనకేసుకురావడం సందేహాలు రేకెత్తిస్తుంది.
'ఒకవేళ ఎవరైనా తప్పు అంటే వారిదే పెద్ద తప్పు అవుతుంది. గతంలో నుండి ఫిలిం ఛాంబర్ మీటింగ్ చూసినట్లయితే రాజు గారు, దాసరి నారాయణరావు గారు అందరినీ ఏకం చేసి మీటింగ్ చేసేవారు. కానీ బాలకృష్ణ అంటే ఒక స్టార్ హీరో.. ఓ ప్రొడ్యూసర్.. ఒక డిస్ట్రిబ్యూటర్.. స్టూడియో హెడ్ అలాంటి ఆయన్ని పిలవకుండా జరపడం అనేది పెద్ద తప్పే. అది బాధాకరమే. తప్పు జరిగింది కానీ ఆ తప్పును సరిదిద్దుకోవటం కరెక్ట్.. కానీ తప్పుకు ఇంకో పది తప్పులు చేయడం మాత్రం తప్పే.. అంటూ ఇండైరెక్ట్ గా ఇండస్ట్రీ పెద్దలకు కౌంటర్ ఇచ్చారు.
ఇక నాగబాబు గారి మాటలైతే లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గారికి చిరంజీవి మీద ఎంత గౌరవం ఉందో చిరంజీవి గారికి బాలకృష్ణ మీద ఎంత మర్యాద ఉందో అందరికీ తెలిసిందే. ఒకవేళ పట్టించుకోవాల్సి వస్తే బాలకృష్ణ చిరంజీవిని ఏమైనా అంటే పట్టించుకోవాలి.. కానీ నాగబాబు మాటలు పట్టించుకునే అవసరం లేదు. అది ఆయన విచక్షణకే వదిలేయాలి. ఎలా మాట్లాడాలి అనేది నాగబాబు తెలుసుకోవాలి.. అంటూ నాగబాబు పై ఘాటుగా స్పందించారు.
ఇంతకుముందు కూడా నాగబాబు గాడ్సే గురించి మాట్లాడారు. అది ఆయన విచక్షణకు చెందిందని వదిలేశారు. కానీ బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోవాలి.. అనేది మాత్రం నాగబాబు విచక్షణకు తెలియాలి. ఆ మాట చిరంజీవి అనాల నేను అనాలా అనేది అని తెలిసి ఉండాలి.. అనటం నిజంగా సినీ వర్గాలను షాక్ కి గురిచేస్తుంది. ఇప్పుడు నిర్మాత ప్రసన్నకుమార్ బాలకృష్ణకు సపోర్టింగ్ గా మాట్లాడడం ఇండస్ట్రీలో చర్చలకు దారి తీస్తోంది. ఆయన మొదటి నుంచి కూడా బాలకృష్ణకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో సినీవర్గాల్లో నిప్పులు రగులుతున్నాయి.