బిల్ గేట్స్ తన భార్య మెలిందాతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకోవడంతోపాటు ఆస్తులు కూడా పంచుకున్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న బిల్ గేట్స్ మొత్తం ఆస్తి విలువ ఇండియన్ కరెన్సీలో చూస్తే.. దాదాపు 8.7 లక్షల కోట్ల పైనే.
సహజంగా తల్లిదండ్రుల ఆస్తిని పిల్లలకు సమంగా పంచుతారు. తమకూ ఓ వాటా వేసుకుంటారు. ఆ లెక్కన చూసినప్పుడు బిల్ గేట్స్ పిల్లలకు లక్ష కోట్లపైనే ఆస్తి దక్కుతుంది. కానీ.. బిల్ గేట్స్ దంపతులు తమ పిల్లలకు ఇచ్చిన ఆస్తి చూస్తే ఖచ్చితంగా నోరెళ్లబెడతారు.
బిల్ గేట్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. భార్యభర్తలతో కలిపి కుటుంబ సభ్యులు ఐదుగురు. అలా లెక్కించుకున్నా.. తలా లక్ష కోట్ల చిల్లర వచ్చే ఛాన్స్ ఉంది. కానీ.. పిల్లలకు కేవలం తలా రూ.73 కోట్లు మాత్రమే ఇచ్చారు! తమ విడాకులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దంపతులు.. పిల్లలకు అతి తక్కువ ఆస్తులు ఇచ్చి మరోసారి నివ్వెరపరిచారు.
అయితే.. తల్లి మెలిందా మాత్రం మరికొంత ఆస్తి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. వారి విడాకుల పత్రం ప్రకారం పిల్లలకు ఆస్తి ఇచ్చే విషయంలో విడాకుల తర్వాత కూడా పంపకాలపై కొత్త నిర్ణయం తీసుకోవచ్చట. దీని ప్రకారమే.. పిల్లలకు మరికొంత ఆస్తిని ఇచ్చేలా ప్రయత్నిస్తున్నారట మెలిందా.