శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పతాకస్థాయికి చేరింది. లంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమ సింఘే అధికారికంగా రాజీనామా చేసేంతవరకూ అధ్యక్ష భవనం.. ప్రధాని నివాసాలను ఆక్రమిస్తూనే ఉంటామని నిరసనకారులు తెలిపారు.జులై 13న అధ్యక్ష పదవి నుంచి దిగిపోతానని రాజపక్స ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ అధ్యక్షుడు కనిపించకపోవడంతో ప్రజలు దండెత్తారు. అధ్యక్ష భవనం ఆక్రమించి తిష్టవేసి అందులోంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.
నిరసనకారులు అధ్యక్ష భవనంలోని రాజభవనాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్కడి సోఫాలు, స్విమ్మింగ్ ఫూల్. ఖరీదైన బల్లల్లో, బెడ్ రూంలలో నిరసనకారులు తిష్టవేసి ఫొటోలు, వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. ఆదివారం నిరసనకారులంతా అధ్యక్ష, ప్రధాని అధికారిక నివాసాల్లోనే గడిపారు. ప్రతీ గదిని పరిశీలిస్తూ.. సెల్ఫీలు తీసుకున్నారు. స్థానికులు కూడా వందలాదిగా ఆ భవనాలను చూసేందుకు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు , పిల్లలతో తిరుగుతూ భోజనాలు కూడా అక్కడే చేశారు. యువకులు సోఫాల్లో కూర్చొని టీవీలు వీక్షిస్తూ గడిపారు.
ప్రధానమంత్రి నిద్రపోయే పడకపైనా కొందరు యువకులు ఎగురుతూ.. దొర్లుతూ ఫొటోలు తీసుకున్నారు. అక్కడున్న వ్యాయామశాలలో కసరత్తులు చేశారు. అధ్యక్షుడి బాత్రూంలో స్నానం చేస్తూ మరికొందరు కనిపించారు. అక్కడే భోజనాలు చేస్తున్నారు. పిల్లా పాపలతో కలిసి గడుపుతున్నారు.
అధ్యక్ష భవనంలోని గదుల్లో నిరసనకారులకు భారీ స్థాయిలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు కనిపించాయి. ` వెంటనే వాటికి లెక్కించి మొత్తం విలువ సుమారు రూ.8 కోట్లుగా తేల్చారు. ఆ సొమ్మును వారు స్థానిక పోలీసులకు అప్పగించారు. నగుదును లెక్కిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆందోళనకారుల్లో కొందరు తాము ఆక్రమించిన అధ్యక్ష , ఇతర ప్రభుత్వ భవన పరిసరాలు శుభ్రం చేస్తూ కనిపించారు. కొలంబోలో ఉన్నత వర్గాలు నివసించే ప్రాంతంలో ఉన్న ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. తాను రాజీనామా చేస్తానని ప్రధాని రణిల్ ప్రకటించారు.