మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ల కుమ్ములాట !

Update: 2020-10-31 17:35 GMT
రాజకీయ నేతలు అంటే , సమాజంలో నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఇక ఒక పార్టీ నేతలు , మరో పార్టీ నేతలపై విమర్శలు చేయడం , అప్పుడప్పుడు గొడవలు పడటం కూడా జరుగుతుంటాయి. కానీ, ఒకే పార్టీ కి చెందిన నేతల మధ్య వర్గ పోరు నడుస్తున్నప్పటికీ , దాన్ని బయటకి కనిపించకుండా మ్యానేజ్ చేస్తుంటారు. కానీ, ఒకటే పార్టీలో ఉంటున్న నేతలే కొట్లాడుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆ అరుదైన ఘటన ఎప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా , టిఆర్ ఎస్ నేతల మధ్య చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికార టీఆర్ ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా మున్సిపల్ కార్యాలయంలోనే నేతలు బాహాబాహీకి దిగారు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల మధ్య శనివారం ప్రోటో కాల్ వివాదం తలెత్తింది.సర్దార్ వల్లభబాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటోకాల్ పాటించాలని వైస్ చైర్మన్ వాగ్వాదానికి దిగాడు. దీనికి అప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ, ఒకరినొకరు నెట్టుకుంటూ ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న మరికొంతమంది కౌన్సిలర్లు అపేందుకు ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. అంతేకాకుడా టీఆర్‌ ఎస్‌ పార్టీ, నాదంటే నాది అనుకుంటూ వాగ్వాదానికి దిగారు. కాగా గత కొంత కాలంగా మున్సిపల్‌ చైర్మన్ రామ తీర్థపు మాధవి, ఆమె భర్త రాజుకు వైస్ చైర్మన్ మధు రాజేందర్‌ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి . ఈ వివాదాన్ని ఇప్పటికే స్థానిక ఎమ్యెల్యే దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో గొడవలు అలాగే కొనసాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు కొట్లాడుకోవడం, అందులోనే ఇద్దరూ అధికార పక్ష నాయకులు వాదులాడుకోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఇక , ఈ ఘటన పై పార్టీ అధిష్టానం కానీ, స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా మంత్రి కేటీఆర్ కానీ ఇంతవరకు‌ స్పందించలేదు. వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News