అర్థరాత్రి వేళలో ఎక్స్ ర్ సైజులు.. అదేంటన్న తల్లిని చంపేసిన సైకో కొడుకు
విన్నంతనే అయ్యో అనిపించటమే కాదు.. ఇలా చేయటం ఏమిటి? అన్న సందేహాలకు గురి చేసే ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ వ్యాయామం చేస్తున్న కొడుకును ఇదేంటి? అని ప్రశ్నించటమే ఆ తల్లి చేసిన తప్పు. ఈ మధ్య వరకు బాగానే ఉన్న అతడు.. తల్లి వేసిన ప్రశ్నకు ఉన్మాదంతో వ్యవహరిస్తూ డంబెల్ తో ఆమెను కొట్టటమే కాదు.. అడ్డు వచ్చిన చెల్లిపైనా దాడి చేశాడు. చివరకు కన్నతల్లిని చంపేసిన ఈ సైకో కొడుకు ఉదంతం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ షాకింగ్ ఉదంతం సంచలనంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కొండా రమేశ్.. పాపమ్మలు కొన్నేళ్ల క్రితం రాంకోఠికి వలస వచ్చారు. ఇళ్లలో పని చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి 25 ఏళ్ల సుధీర్.. 24 ఏళ్ల సుచిత్రలు పిల్లలు. ఎనిమిదేళ్ల క్రితం భర్త రమేశ్ అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి పాపమ్మ కుటుంబ భారాన్ని మోస్తోంది. సుధీర్ ను డిగ్రీవరకు చదివించింది.
అందరితో మామూలుగా వ్యవహరించటమే తప్పించి.. ఎప్పుడూ ఎక్కడా వివాదాస్పదంగా వ్యవహరించింది లేదు. నెల క్రితం స్విగ్గీ.. జొమాటోలలో డెలివరీ బాయ్ గా పని చేసేవాడు. ఏమైందో ఏమో కానీ.. నెల క్రితం డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని మానేశాడు. ఇంట్లోనే ఉండసాగాడు. రాత్రిళ్లు వ్యాయామం చేసేవాడు. దీనికి ఇరుగుపొరుగువారు అభ్యంతరం చెబుతుంటే.. తల్లి పాపమ్మ వారికి సర్ది చెప్పేది. ఆదివారం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో వ్యాయామం చేస్తున్న కొడును మందలించి.. పడుకోవాలని చెప్పింది. అదే పాపమైంది.
తీవ్ర ఆగ్రహానికి గురైన సుధీర్.. ఆమెను డంబెల్ తో బలంగా మోదాడు. అడ్డు వచ్చిన చెల్లెలు మీదా దాడి చేసి.. ఆమెను రూంలోకి నెట్టేసి తల్లిని కొడుతూనే ఉన్నాడు. సుచిత్ర పెద్దగా అరుస్తూ.. తలుపులు కొడుతూ ఉండటంతో తలుపు తీసి.. అమ్మను చంపేశానని ఉన్మాదంగా అనటం.. అడ్డుకునే ప్రయత్నం చేసిన సుచిత్ర మీదా డంబెల్ తో దాడి చేశాడు. దీంతో ఆమె బయటకు పరుగు దీసి.. ఇరుగుపొరుగు వారి సాయాన్ని కోరింది.
వారు వచ్చేందుకు పావు గంట పట్టగా.. అప్పటివరకు తల్లిని డంబెల్ తో కొడుతూనే ఉన్నట్లు చెబుతున్నారు. చనిపోయిన తర్వాత కూడా కొడుతూనే ఉన్న వైనం షాకింగ్ గా మారింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారికి ఎదురు తిరగటం.. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకిలా చేశాడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే.. సుధీర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారించే క్రమంలో ఆసక్తికర విషయాలు బయటకువచ్చాయి. సినిమా హీరో రానాతో పాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సహా పలువురు సినీ ప్రముఖులకు అతడు సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఎలాంటి సినిమాలు తీయాలన్న దానిపై లెక్కలేనన్ని సలహాలతో పోస్టులు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. అతడి మానసిక పరిస్థితి బాగోలేదని తేల్చిన అధికారులు అతడ్ని ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపి చికిత్స చేస్తున్నారు. మరణించిన పాపమ్మ డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.