భారతీయులకు సొంతంగా పబ్ జీ.. సంస్థ కీలక నిర్ణయం

Update: 2020-09-08 17:32 GMT
పబ్ జీ.. దేశంలోనే పాపులర్ గేమ్. కోట్ల మంది భారతీయులు దీనికి ఫ్యాన్స్. ఈ గేమ్ పై భారత్ ఇటీవల నిషేధం విధించింది. చైనాతో వార్ నేపథ్యంలో 118 యాప్ లను కేంద్రం నిషేధించింది. ఈ క్రమంలోనే పబ్ జీ పై కూడా బ్యాన్ పడింది.

అయితే యువతలో ఎక్కువగా ఆదరణ పొందిన పబ్ జీని భారత్ నిషేధించిన నేపథ్యంలో పబ్ జీ కార్పొరేషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం భారత్ లో పబ్ జీ, పబ్ జీ లైట్ ఫ్రాంచైజీగా ఉన్న టెన్ సెంట్ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

పబ్ జీ ఫ్రాంచైజీగా ఉన్న టెన్ సెంట్ నుంచి గేమ్ పబ్లిషింగ్ అధికారాలను వెనక్కి తీసుకుంటున్నామని పబ్ జీ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో ఫ్రాంచైజీలతో సంబంధం లేకుండా చూస్తాం. పబ్ జీ గేమింగ్ అనుభవాన్ని నేరుగా భారతీయులకు అందించడానికి పబ్ జీ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోందని పబ్ జీ వెబ్ సైట్ పేర్కొంది.

అయితే భారత్ లో ఈ కంపెనీ పెడుతామని పబ్ జీ మాతృసంస్థ ప్రకటించడంతో ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News