పబ్జీ ఆట దేశ యువతరాన్ని ఎంతలా ఊపేసిందో మనం చూశాం. గేమింగ్ ప్రియుల కోసం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎన్నో నెలల తర్వాత సంస్థ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లపై కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.పబ్ జీ మొబైల్ ఇండియాలో బ్యాన్ కు గురై సంవత్సరాలు గడుస్తున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మళ్లీ గేమ్ ఎప్పుడు వస్తుందా? అని లక్షలాది మంది వేచిచూస్తున్నారు. వారి కోసం అన్నట్లుగా గుడ్ న్యూస్ అందించింది సదురు సంస్థ.
పబ్జీ మొబైల్ ఇండియా ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఇండియాలో అడుగుపెడుతోంది. ఈ వారం ప్రారంభంలో ఒక నివేదిక పబ్జీ మొబైల్ ఇండియా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా ప్రారంభించబోతున్నట్లు సూచించింది. అధికారిక టీజర్ పోస్టర్ ఈ మేరకు ప్రకటన చేసింది.
మొబైల్ గేమ్ త్వరలో వస్తుంది అని అధికారిక పోస్టర్ ద్వారా కంపెనీ చెబుతోంది. పబ్జీ మొబైల్ ఇండియా సోషల్ మీడియా హ్యాండిల్ ను యుద్ధభూమి మొబైల్ ఇండియాగా మార్చారు.ఇక పబ్జీ మొబైల్ ఇండియా ఫేస్ బుక్ హ్యాండిల్ మరియు యూట్యూబ్ పేజీ పోస్టర్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మార్చేశారు. ట్విట్టర్ హ్యాండిల్ పేరు మాత్రం మార్చలేదు.
గత వారమే పబ్జీ మొబైల్ ఇండియా తన యూట్యూబ్ చానెల్ లో అధికారికంగా కొత్త ట్రైలర్ ను పోస్ట్ చేసింది. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద పబ్జీ మొబైల్ గేమ్ భారతదేశంలో నిషేధించబడింది. నిషేధించబడిన పబ్జీ మొబైల్ మాత్రమే దేశంలోకి కొత్త పేరుతో తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది.