పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖమర్ బాజ్వాను పంజాబ్ మంత్రి - మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ హత్తుకోవడం ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్ధూ హాజరైన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం భగ్గుమన్నారు. జనరల్ బాజ్వా పట్ల ఆప్యాయత ప్రదర్శించడం తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. ``పాకిస్థాన్ సేనల వైఖరితో ప్రతి రోజూ సరిహద్దుల్లో మన సైనికులు అమరులవుతున్నారు. పాక్ ఆర్మీ అధిపతి బాజ్వాను హత్తుకోవడానికి నేను వ్యతిరేకం. అతడి ఆదేశానుసారమే పాక్ సైనికుల దాడిలో రోజూ మన సైనికులు అమరులవుతున్నారని సిద్ధూ అర్ధం చేసుకోవాలి`` అని అమరిందర్ సింగ్ పేర్కొన్నారు. తాను పనిచేసిన రెజిమెంట్ పరిధిలో కొన్ని నెలల క్రితమే భారత సైన్యం ఒక మేజర్ - ఇద్దరు జవాన్లను కోల్పోయిందని అమరిందర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పాక్ సైన్యానికి ఆ దేశ సైనికాధ్యక్షుడు బాజ్వా జారీచేసే ఆదేశాలే కారణమన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ వ్యక్తిగత హోదాలోనే పాకిస్థాన్ వెళ్లారని - కాంగ్రెస్‌కు సంబంధం లేదని అమరిందర్ సింగ్ చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడి పక్కన సిద్ధూకు సీటు కేటాయింపుపై అమరిందర్ స్పందిస్తూ అతడెవరో సిద్ధూకు తెలియకపోవచ్చని విశ్లేషించారు.
ఇలా ఓ వైపు సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనే మరోవైపు సిద్దుకు షాక్ వంటి వార్త వినిపించింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వాను కౌగిలించుకున్నందుకు పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూపై రాజద్రోహం కేసు నమోదైంది. బీహార్ లో ముజఫర్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధుర్ ఓఝా ఐపీసీలోని సెడిషన్ సహా పలు సెక్షన్ ల కింద సిద్ధూపై కేసును దాఖలు చేశారు. సిద్ధూ చర్య దేశప్రజలను గాయపరిచిందని తన ఫిర్యాదులో ఓఝా పేర్కొన్నారు. కాగా, కోర్టు ఈ కేసు విచారణకు అంగీకరించిందని - వచ్చేవారంలో విచారణ ప్రారంభమవుతుందని చెప్పారు. దీనిపై ఇప్పటివరకు సిద్దూ స్పందించలేదు.
అయితే, పాక్ ఆర్మీ చీఫ్ ను సిద్దూ కౌగిలించుకోవడంపై పలురాజకీయ పార్టీలు సహా సొంతపార్టీ నేతలూ అసహనం వ్యక్తం చేస్తుండగా...ఆయన మాత్రం సమర్థించుకున్నారు. వాఘా సరిహద్దు మీదుగా స్వదేశానికి తిరిగొచ్చిన పంజాబ్ మంత్రి సిద్ధూ మాట్లాడుతూ పాక్ ఆర్మీ చీఫ్ బాజ్వాను హత్తుకోవడం సమర్ధనీయమేనన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు మసూద్ ఖాన్ పక్కన తన సీటు కేటాయించడంపై స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన తాను.. ఆహ్వానించిన వారు కేటాయించిన సీటులోనే కూర్చోవాలి కదా? అని ప్రశ్నించారు. తాను వేరేచోట కూర్చున్నా తిరిగి కేటాయించిన సీటులోనే కూర్చోవాలని కోరారన్నారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో సీఎం అమరిందర్ ను కలుసుకుని వివరణ ఇవ్వడానికి సిద్ధూ ప్రయత్నించకపోవడం గమనార్హం.