లాక్‌ డౌన్ పొడ‌గింపు: పంజాబ్‌ లో మే 17 వ‌ర‌కు

Update: 2020-04-29 13:30 GMT
లాక్‌ డౌన్ పొడిగింపుపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ కొన‌సాగుతోంది. క‌రోనా కేసులు తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ ను పొడిగించే యోచ‌న‌లో ఉండ‌గా వైర‌స్ ప్ర‌భావం అంత‌గా లేని రాష్ట్రాలు లాక్‌ డౌన్ ఎత్తివేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. వాస్త‌వంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌ డౌన్ మే 3వ తేదీతో ముగియ‌నుంది. అయితే తెలంగాణ‌లో మాత్రం మే 7వ తేదీతో ముగుస్తుంది. గ‌తంలోనే ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు లాక్‌ డౌన్‌ ను పొడిగించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్రం నిర్ణ‌యం ఎలా ఉన్నా త‌మ రాష్ట్రంలో మాత్రం లాక్ డౌన్‌ ను పొడిగిస్తున్న‌ట్లు పంజాబ్ ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు బుధ‌వారం పంజాబ్‌ ముఖ్య‌మంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏకంగా రెండు వారాల పాటు లాక్‌ డౌన్‌ పొడిగించడం గ‌మ‌నార్హం. అయితే పంజాబ్ బాట‌లోనే మ‌రికొన్ని రాష్ట్రాలు వెళ్లే అవ‌కాశం ఉంది. గుజ‌రాత్‌ - మ‌హారాష్ట్ర‌ - ఢిల్లీ త‌దిత‌ర రాష్ట్రాల్లో లాక్‌ డౌన్ పొడిగించే అవ‌కాశం ఉంది. అయితే ఇంకా కొన్నాళ్లు ఉండ‌డంతో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

దేశ‌వ్యాప్తంగా లాక్‌ డౌన్ తొలిదశ మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వ తేదీ దాకా కొన‌సాగింది. రెండోద‌శ మే 3వ తేదీ‌తో ముగియ‌నుంది. అయితే క‌రోనా ఇంకా క‌ట్ట‌డి కాక‌పోవ‌డంతో లాక్‌ డౌన్ పొడిగించే అవ‌కాశం ఉంది. అయితే దానిపై త్వ‌ర‌లోనే ఓ స్ప‌ష్ట‌త రానుంది.


Tags:    

Similar News