చాయ్ అమ్ముకున్న బుద్ది పోనిచ్చుకోని మోడీ

Update: 2016-08-12 15:36 GMT
గోరక్షకుల ముసుగులో అసాంఘిక శక్తులు అరాచకాలకు పాల్పడుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం రేకెత్తిస్తున్నాయి. వీటికి సానుకూల స్పంద‌న కంటే ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు రావ‌డం ఆస‌క్తిక‌రం. ఈ నేప‌థ్యంలో తాజా గోరక్షకులపై ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పంజాబ్‌ లోని పాటియాలా గోరక్షకులు మాట్లాడుతూ టీ అమ్మిన స్థాయి నుంచి ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఇంకా టీ అమ్మిన మనస్తత్వం నుంచి బయటపడలేక‌పోతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. పాటియాల‌లో సమావేశమైన గోరక్షా దళ్ సభ్యులు ఆల్ ఇండియా గోరక్షా దళ్‌ కు మద్దతు ప్రకటించారు. అలాగే గో సంరక్షణ చర్యలు విరివిగా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గోరక్షా దళ్ సభ్యుడు రాకేష్ శర్మ మాట్లాడుతూ, 'ఆయన చాయ్‌ వాలా నుంచి ప్రధాని స్థాయి కి ఎదిగారు. కానీ ఇప్ప‌టికీ పాత ఆలోచ‌న దోర‌ణిని పోనిచ్చుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

మ‌రోవైపు గోరక్షకులకు ఐడీ కార్డులు ఇవ్వాలని హర్యానా కౌ కమిషన్ యోచిస్తోంది. ప్ర‌ధాన‌మంత్రి వ్యాఖ్య‌ల నేపథ్యంలో నకిలీ గోరక్షకులకు అడ్డుకట్ట వేయాలని భావించిన హర్యానా కౌ కమిషన్ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. గో రక్షకుల పేరుతో కొందరు నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారని కౌ కమిషన్ చీఫ్ - ఆరెస్సెస్ నేత బనీరామ్ మంగ్లా తెలిపారు. ఈ నేపథ్యంలో నకిలీలకు చెక్ పెట్టేందుకు ఐడీ కార్డులు ఇవ్వనున్నారు. హర్యానాలో మొత్తం వంద మంది గో రక్షకులు ఉన్నారని మంగ్లా తెలిపారు.
Tags:    

Similar News