తన సొంత జిల్లా చిత్తూరులో ఇసుక మాఫియా చెలరేగిపోవడం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తీవ్ర ఇరకాటంలో పడేస్తోంది. ఏర్పేడులో అనుమానాస్పద రోడ్డు ప్రమాదం-15 మంది దుర్మరణం పాలవడం వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందనే వార్తలు రావడంతో విపక్షాలు బాబుపై దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మిత్రపక్షమైన బీజేపీ వచ్చిచేరింది. ఏకంగా జాతీయ స్థాయి నేతలు చంద్రబాబు తీరును తప్పుపట్టారు. ఏపీలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోందని, అన్ని నదులను మాఫియా తవ్వేస్తోందని కేంద్ర మాజీ మంత్రి - బీజేపీ మహిళా మోర్చా ఇన్ ఛార్జ్ పురందేశ్వరి మండిపడ్డారు.
చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో 16 మంది మృతి చెందడం బాధాకరమని పురందీశ్వరి అన్నారు. ఏపీలో ఓవైపు ఉచిత ఇసుక అంటున్నారని, మరోవైపు లారీలతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు తనకు తెలియవని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం సరికాదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. మాఫియా - అవినీతి అంశాలపై తాను తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని పురందీశ్వరి సూచించారు. అవినీతి - సహజవనరులను దోచుకోవడం - అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోకపోతే వారు చెలరేగిపోతారని ఇంది పరిపాలకుల వైపల్యం అవుతుందని వ్యాఖ్యానించారు.
కాగా, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పురందీశ్వరి పునరుద్ఘాటించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సింహభాగం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి ఆర్థిక సహాయం - పోలవరం నిర్మాణం - పలు అభివృద్ధి పనులకు కేంద్రం సాయం చేస్తున్నదని వివరించారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రచారం కల్పించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి వెనుకబడిన వర్గాకు న్యాయం చేశారని పురందీశ్వరి అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/