ఆమె కూడా భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కీలక నాయకురాలు.. మొన్నమొన్నటి వరకూ కాంగ్రెసు పార్టీలో ఉండి, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకురాలు.. అన్నిటినీ మించి అన్న ఎన్టీఆర్ కు స్వయానా కూతురు. చంద్రబాబునాయుడుకు వదిన. ఆమె దగ్గుబాటి పురందేశ్వరి. అందుకే ఆమె మాటలు అన్నప్పుడు.. ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు. వెంటనే తిరస్కరించకుండా.. ఆమె మాటల్లో నిజం ఉన్నదేమో అని ఆలోచిస్తారు. ఇప్పుడు పురందేశ్వరి మాటలు వింటోంటే చంద్రబాబునాయుడు వైఖరి మీద పలు అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం గురించి, ఆయన చిత్త శుద్ధి మీద ఇప్పటికే జనంలో పలు అనుమానాలు ఉన్నాయి. అలాగే తాజాగా.. ఆయన కార్యశీలత, చేసిన ప్రయత్నం మీదకూడా అనుమానాలు కలుగుతున్నాయి.
పురందేశ్వరి ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా వీలైనంత ఎక్కువ న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదంటూ సెలవిస్తున్నారు. అలాంటి మాటలు వల్లిస్తూ ప్రత్యేకహోదా విషయంలో ఆమె కొత్త అనుమానాల్ని జనం మదిలో నాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంలోని నాయకులు.. ప్రత్యేకహోదా గురించి తాము ఢిల్లీ వెళుతున్నామని ప్రయత్నిస్తున్నామని చెబుతూ ఉన్నారే గానీ.. అక్కడ ఢిల్లీకి వెళ్లిన తర్వాత.. నాయకులతో ఈ విషయాన్ని అడుగుతున్నారో లేదో అని తనకు అనుమానంగా ఉన్నదని ఆమె సెలవిచ్చారు.
ఇక్కడే అసలు అనుమానాలు రేగుతున్నాయి. అసలే చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా గురించి పట్టించుకోవడం లేదని, ఆ విషయంలో ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని.. ఉద్యమాలు అక్కర్లేదు.. సంయమనంతో మంచిగా ఉండి సాధించుకుందాం.. వంటి పడికట్టు డైలాగులతో.. ప్రజల్ని మోసం చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. హోదా సాధించడం కోసం మేం చేయగలిగింది అంతా చేస్తూనే ఉన్నాం అంటూ.. తెలుగుదేశం నాయకులు ఊదరగొట్టేస్తూ ఉన్నారు. 'తాను ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చానో.. ఎందరు కేంద్రమంత్రులను ఎన్నేసిసార్లు కలిశానో' అంటూ చంద్రబాబు గణాంక వివరాలు పట్టుకుని సిద్ధం అవుతారు. అంతే తప్ప.. వాస్తవానికి వీరు ఢిల్లీ వెళుతున్నారు ...నేతల్ని కలుస్తున్నారు.. అయితే.. ప్రత్యేకహోదా గురించి మాత్రం సీరియస్‌గా అడగడం లేదా.. అని పురందేశ్వరి మాటలను బట్టి అనుమానం కలుగుతోంది. తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి చంద్రబాబు సర్కారు ఏదో ఒకటి చేయాలని ప్రజలు అనుకుంటున్నారు.