భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నేత పురందేశ్వరి ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చత్తీస్ గఢ్ లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆమె మాటలు తీవ్రంగా ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ను ఉద్దేశించి పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. కార్యకర్తల్లో జోష్ తీసుకురావడానికే అన్నారో ఏమో కానీ.. * మీరంతా ఒక్కసారి కలిసి ఉమ్మేస్తే.. ఆ ఉమ్మిలో ముఖ్యమంత్రి బాఘేల్ కొట్టుకుపోతారు..* అంటూ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
అత్యుత్సాహంతో కూడిన అసంమజసమైన ప్రకటన ఇది. కార్యకర్తలను ఉత్సాహ పరచడం ఏ పార్టీ నేత అయినా చేస్తారేమో కానీ.. ఇలా ఉమ్మేయడం, ఉమ్మిలో ముఖ్యమంత్రి కొట్టుకుపోతారని అనడం.. మాత్రం అంత సబబైన మాట కాదు. అది కూడా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రి గా వ్యవహరించిన ఒక నేత ఇలాంటి మాటలు మాట్లాడటం అంత బాగోలేదేమో. తన రాష్ట్రం కాదు, ఏమీ కాదు. అలాంటప్పుడు మరీ ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఎందుకో పురందేశ్వరికే తెలియాలి.
ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించడం జాతీయ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. బీజేపీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడటంపై విమర్శలకు తావిస్తోంది. ఇటీవలే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఠాక్రే చెంపపగులగొట్టేవాడినంటూ బీజేపీ నేత, కేంద్రమంత్రి ఒకరు ఇచ్చిన స్టేట్ మెంట్ వివాదాస్పదంగా మారింది. ఆ కేసులో ఆయనను అరెస్టు కూడా చేశారు, బెయిల్ వెంటనే వచ్చినా.. ఆ అంశంలో కేంద్రమంత్రిని బీజేపీ వాళ్లు కూడా అంత తేలికగా వెనకేసుకు రాలేకపోయారు. ఇప్పుడు పురందేశ్వరి అంతకన్నా ఘాటుగా మాట్లాడారు. సభ్యసమాజం ఆమోదించే విమర్శ కాదిది.
ఇక పురందేశ్వరి వ్యాఖ్యలపై బాఘేల్ కూడా స్పందించారు. ఆమె నుంచి ఆ తరహా మాటలు ఎక్స్ పెక్ట్ చేయాలేదంటూ ఆయన అన్నారు. ఇలా పురందేశ్వరిపై తిరిగి విమర్శలు చేయకుండానే.. ఆమె మాటలు అసమంజసంగా ఉన్నాయన్నట్టుగా బాఘేల్ స్పందించారు. అంతే కాదు.. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది జాగ్రత్త అని కూడా ఆయన కౌంటరిచ్చారు.