ఏపీలో కాపులు వర్సెస్ బీసీ నేతలు అన్నట్లుగా సాగుతున్న రిజర్వేషన్ వార్ నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి - బీజేపీ మహిళా నాయకురాలు పురంధేశ్వరీ నిర్వహించిన ప్రత్యేక సమావేశం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాపులను బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కమిటీ వేసిన విషయం తెలిసిందే. కాపులకు నష్టం జరగకుండా బీసీలలో చేరుస్తామని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే కాపులను తమ కేటగిరీల్లో చేర్చవద్దని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంఘం నేతలతో పురందేశ్వరీ ప్రత్యేకంగా భేటీ అవడం గమనార్హం.
బీసీ సంఘం అధ్యక్షులు శంకరరావు నివాసంలో పురందేశ్వరీ సమక్షంలో ఈ భేటీ జరిగింది. ఈ సమయంలో కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. కాపులను బీసీల్లో చేరిస్తే నష్టం ఏమిటి? కాపులను బీసీల్లో చేర్చుకోవాలా, వద్దా? కాపులను బీసీల్లో చేర్చడమనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందా? తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. దీంతో పాటుగా రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పైన వారు చర్చించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కాపుల్లోకి బీసీల అంశంపై వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో బీసీ సంఘం నేతలతో పురంధేశ్వరి భేటీ కావడం ఇటు టీడీపీ - అటు బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/