గోదావరి పుష్కరాలకు జనం పోటెత్తుతున్నారు. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా గోదారమ్మ కనిపించిన ప్రతిచోట జనం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారంతో మొదలైన రద్దీ.. శనివారం పీక్ స్టేజ్ కి వెళితే.. ఆదివారం కూడా అది కంటిన్యూ అయ్యింది.
వరుసగా రెండు రోజులు సెలవులు రావటంతో భక్తులు భారీగా గోదారమ్మ వద్దకు తరలి వెళ్లారు. ఆదివారం ఆరో రోజున ఏపీలో 53 లక్షల మంది స్నానాలు చేస్తే.. తెలంగాణలో 50 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాల కోసం భక్తులు వెల్లువలా వచ్చేయటంతో గోదావరి ఘాట్లలన్నీ కిక్కిరిసిపోయాయి. శనివారం నాటి అనుభవంతో అధికారులు.. ఆదివారం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వెల్లువలా వచ్చే జన ప్రవాహానికి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయటానికి ఏమేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలో వాటిని చేపట్టారు.
అయితే..శనివారంతో పోలిస్తే.. ట్రాఫిక్ కష్టాలు తగ్గినా.. పూర్తిగా లేకుండా పోలేదు. శనివారం మాదిరే ఆదివారం జనం పోటెత్తినా.. శనివారం అనుభవం ఆదివారం నాడు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించారు. పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ సర్కారు పుష్కర జిల్లాలకు మరిన్ని బస్సుల్ని పంపటంతోపాటు.. పోలీసుల బలగాల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఐదు వేల మంది అదనపు పోలీసు బలగాలు పుష్కర జిల్లాలకు తరలి వెళ్లాయి.
మరోవైపు ఏపీలో ఆదివారం రోజున 53 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. శనివారంతో పోలిస్తే.. ఆదివారం రద్దీ కాస్త తక్కువగా కనిపించింది. ఒక్క రాజమండ్రిలోనే 28 లక్షల మంది స్నానాలు చేశారు. గత ఆరు రోజుల్లో.. ఏపీలోని గోదావరి పుష్కరాల్లో మొత్తం 2.2కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. భారీగా పెరుగుతున్న పుష్కర యాత్రికులు టిఫిన్.. భోజన ఏర్పాట్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీ సర్కారు టీటీడీ నేతృత్వంలో అన్నదానం చేయాలని సంకల్పించింది. సోమవారం నుంచి అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి ఒక్క టిటిడీ లక్షమందికి అన్నదానం చేసేలా నిర్ణయం తీసుకున్నారు.