గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వెళుతున్న భక్తులకు సినిమా కనిపిస్తోంది. వర్షాకాలంలోనూ మండే ఎండల పుణ్యమా అని పుష్కరాల కోసం వెళుతున్న భక్తులు ఉడికిపోతున్న పరిస్థితి. ఉత్సాహంగా పుష్కర స్నానం చేసి ఎంజాయ్ చేయాల్సిన స్థానే.. ఉడుకు తట్టుకోలేక.. నీరసించి పోతున్న పరిస్థితి. వర్షాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయి.
అయితే.. ఈ ఏడాది జూలై నెలలో సైతం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం..రెండో ఎండాకాలాన్ని తలపించేలా ఉన్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రాజమండ్రిలో నమోదు కావటం గమనార్హం.
గోదావరి పుష్కరాల సందర్భంగా భక్త జనం భారీగా జమ అయ్యే ప్రాంతంలో ఎండలు మండిపోవటంతో లక్షలాది భక్తజనం తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్న పరిస్థితి. పుష్కరాల కోసం రాజమండ్రికి ప్రత్యేకంగా వెళ్లే వారు ఎందరో. అయితే.. రాజమండ్రిలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు భక్త జనం తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. మండిపోయే ఎండలో.. స్నానం చేయటం.. అరకొర వసతుల మధ్య ఉడికిపోతూ.. ఇంటిముఖం పట్టటం.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు భారీగా సొమ్మసిల్లిపోతున్నారు.
భక్తజనం పరిస్థితే ఇలా ఉంటే.. పుష్కర పనులు చేస్తున్న అధికారుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. గంటల తరబడి పనులు చేయాల్సి రావటం.. పని ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో.. ఉద్యోగులు పుష్కరాలు ఎప్పుడు అయిపోతాయిరా బాబు అని అనుకునే పరిస్థితి. ఒక్క గురువారం సంగతే తీసుకుంటే.. రాజమండ్రిలో పగటి ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు. అంటే.. 41 డిగ్రీల ఎండ అన్నమాట. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రత.. జూలైలో నమోదు కావటం గమనార్హం.
చెమటలు ధారలుగా కారుతుంటే.. వాటిని తుడుచుకోలేక.. పుష్కరస్నానం ఒక పక్క.. చెమట స్నానం మరో పక్క చేస్తూ.. ఉడుకుతో.. ఉడికిపోతున్నారు రాజమండ్రి పుష్కరాలకు వెళుతున్న భక్త జనం. పుష్కరాలకు వెళితే పుణ్యం సంగతేమో కానీ.. రాజమండ్రికి వచ్చే వారికి మాత్రం ఉడుకు ఖాయంగా కనిపిస్తోంది. రాజమండ్రి పుష్కరాల్ని ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘పుష్కరాలు చాలా హీట్ గురూ’’ అని చెప్పక తప్పదు. రాజమండ్రి వెళ్లాలని అనుకునే భక్తులు.. ఎండ తీవ్రత విషయంలో కూడా కాస్త ఆలోచించి.. తగిన విధంగా ప్లాన్ చేసుకొని వెళ్లటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.