పుతిన్.. ఓ సీక్రెట్ మిషెన్

Update: 2020-08-12 13:30 GMT
అగ్ర రాజ్యాలు అమెరికా, బ్రిటన్, చైనా వంటివి కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం పరిశోధనల మీద పరిశోధనలు చేస్తుంటే.. తీపి కబురు చల్లగా చెబుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏకంగా కరోనా వ్యాక్సిన్ ను ఆ దేశంలో రిలీజ్ చేశాడు. ఈ వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు.. విమర్శలు ఉన్నాయి. వైద్య ప్రమాణాలు పాటించకుండా రెండు క్లినికల్ ట్రయల్స్ కే ఈ వ్యాక్సిన్ విడుదల చేయడంపై వైద్య వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అయితే మూడు నెలలకే వ్యాక్సిన్ విడుదల చేయడంపై ప్రపంచ దేశాలన్నీ తనను విమర్శిస్తాయని గ్రహించిన పుతిన్ ఏకంగా మొదటి వ్యాక్సిన్ ను తన కూతురిపై ప్రయోగించి సాహసమే చేశాడు. అది బాగా పనిచేస్తోందని నిరూపించాడు. తద్వారా విమర్శకుల నోళ్లు మూయించాడు.

పుతిన్ ఎప్పుడూ ఓ సీక్రెట్ మిషన్ అని ప్రపంచ వర్గాల్లో పేరుంది. రష్యా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆ దేశాన్ని ప్రపంచదేశాల సరసన నిలపడంలో పుతిన్ కృషి ఉంది. అందుకే అక్కడి ప్రజలు పుతిన్ ను జీవిత కాలం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పుతిన్ కోసం ఏకంగా రష్యా రాజ్యాంగాన్నే మార్చేశారు.

పుతిన్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో పేద కుటుంబంలోనే జన్మించాడు. గూఢచారి సినిమాలపై మోజుతో 16 ఏళ్లకే 1968లో రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ‘కేజీబీ’లో చేరాడు. రష్యా ఆధీనంలో ఉన్న తూర్పు జర్మనీలోని కేజీబీ ఆఫీసులో కొన్నాళ్లు ట్రాన్స్ లేటర్ గా పనిచేశాడు. 1989లో బెర్లిన్ లోని గోడను కూల్చివేసిన సమయంలో జర్మన్లు కేజీబీ ఆఫీసును చుట్టుముట్టగా పుతిన్ సాహసోపేతంగా వ్యవహరించి అడ్డుకొని రష్యాలో పాపులర్ అయ్యాడు.

2000 మే 7న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలు రాగా.. ఆయన నమ్మినబంటు అయిన పుతిన్ ను అధ్యక్షుడిగా చేశారు. ఇక అప్పటి నుంచి రష్యా ప్రధానిగా.. అధ్యక్షుడిగా మారుతూ ఏకంగా ప్రజల మనసు గెలిచి జీవితకాలపు అధ్యక్షుడయ్యాడు.
Tags:    

Similar News