కొందరు కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచాన్ని ఎంత నాశనం చేశాయో.. ప్రపంచ వృద్ధిని ఎంతగా దెబ్బ తీశాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాంకేతికంగా అంతగా అభివృద్ధి చెందని సమయంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంతో పోలిస్తే.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వినాశనం ఎక్కువ. కోట్లాది మంది ప్రాణాల్ని తీసిన రెండో ప్రపంచ యుద్ధ ముగిసినప్పుడే.. మరో ప్రపంచ యుద్ధం కానీ వస్తే సర్వనాశనమే అన్న భావన వ్యక్తమైంది. పైగా ఇపుడు టెక్నాలజీ చాలా ఎక్కువ.
రెండు ప్రపంచ యుద్ధాలతో అన్ని దేశాలు భారీగా నష్టపోయిన నేపథ్యంలో.. ప్రపంచానికి శాంతి మాత్రమే అవసరం తప్పించి.. యుద్ధం ఎంతమాత్రం కాదన్న భావన అగ్రరాజ్యాల మదిలో మెదిలిన పరిస్థితి. దీనికి తగ్గట్లే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ యుద్ధం అన్న మాట రాకుండా సాగుతోంది. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో రెండు అగ్రదేశాల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఉన్నప్పటికీ.. మూడో ప్రపంచయుద్ధం రాలేదు.
యూఎస్ ఎస్ ఆర్ ముక్కలయ్యాక.. రష్యా ఆర్థికంగా చితికిపోవటంతో అమెరికాకు ఎదురు లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా పుతిన్ కారణంగా రష్యా బలపడుతోంది. మొండితనం కాస్త ఎక్కువైన పుతిన్ తీరుతో పాటు.. అమెరికా అధిపత్యాన్ని ప్రశ్నించే ధోరణి పుతిన్ కు ఎక్కువే. ఏదైనా విషయంలో తన మాట చెల్లుబాటు అయ్యే విషయంలో మొండిగా వ్యవహరించే పుతిన్.. తాజాగా సిరియా ఇష్యూ అమెరికా.. రష్యాల మధ్య దూరం పెంచుతోంది. ఆ దేశం విషయంలో రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు ఒబామా తప్పు పట్టటంతో వాతావరణం వేడెక్కింది.
ఇదిలా ఉంటే.. ఇతర దేశాల్లో ఉన్న రష్యా అధికారులు.. రాజకీయ నేతలు.. ఇతర దేశాల్లోపని చేస్తున్న రష్యాప్రజల్ని స్వదేశానికి రావాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపు ఇచ్చినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు కొత్త ఆందోళనలకు తెర తీస్తున్నాయి. సిరియా అంశం.. ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ పుతిన్ చేతలు ఉన్నట్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే.. భారీ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లేవ్ బెల్కోవిస్కీ చెబుతున్న మాట ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ప్రపంచ శ్రేయస్సు కోసం పుతిన్.. ఒబామాల ఎలా వ్యవహరిస్తారన్న విషయం మీదే ప్రపంచ భవిష్యత్ ఆధారపడి ఉందనటంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/