పుతిన్ ప్రేయసిని వెళ్లగొట్టాలి.. యూరప్ లో డిమాండ్

Update: 2022-03-22 08:33 GMT
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా అధ్యక్షుడు చర్యలకు ఆయన లవర్ బాధ్యురాలవుతోంది. ఇప్పటికే అమెరికా, యూరప్, ఇతర దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కితగ్గడం లేదు. 25 రోజులకు పైగా ఉక్రెయిన్ పై దాడులతో బెంబేలెత్తిస్తున్నాడు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నా బాంబులేస్తున్నారు.

ఉక్రెయిన్ పై పట్టుకోసం రష్యా బలగాలు చెమటోడుస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం నుంచి కూడా యూరప్ దేశాల అండదండలతో తీవ్రంగా పోరాడుతున్నాయి.

ఈ యుద్ధానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రేయసియే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె పేరు అలినా కబేవా.. రష్యాకు చెందిన జిమ్నాస్టిక్ ఈమె. 2004 ఏథేన్స్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి రష్యా తరుఫున పేరు నిలబెట్టింది.

పుతిన్ తో అలినాకు 2008 నుంచి పరిచయం ఉంది. అప్పటినుంచే వారిద్దరూ కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. అలినానే పుతిన్ గర్ల్ ఫ్రెండ్ అనే ప్రచారం కూడా ఉంది. అదే ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది.

ప్రస్తుతం అలినా కబేవా స్విట్జర్లాండ్ లో నివాసం ఉంటోంది. ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె ఓ లగ్జరీ విల్లాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తర్వాత స్విట్జర్లాండ్ లో ఉన్న అలినా కబేవాను వెళ్లగొట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రష్యా అధ్యక్షుడు ప్రేయసిని దేశం నుంచి తరిమేయాలంటూ ఆన్ లైన్ లో ఓ పిటీషన్ పెట్టారు.  ఈ పిటీషన్ పై పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరుగుతోంది. ఉక్రెయిన్, బెలారస్, రష్యాకు చెందిన వారు కూడా సంతకాలు పెట్టారు. మొత్తంగా సుమారు 50వేల మంది ఈ పిటీషన్ పై సంతకం చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అలీనా వయసు 38 ఏళ్లు. గతంలో పుతిన్ కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ ఎంపీగా కూడా ఆమె ఆరేళ్ల పాటు పనిచేశారు. ఉక్రెయిన్ లో యుద్ధం నేపథ్యంలో అలీనాను స్విట్జర్లాండ్ కు పంపినట్లు వార్తలు వచ్చాయి. దీంతోనే ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలీనా చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. మాస్కోలో జరిగిన ఓ జిమ్నాస్టిక్ పోటీలో గత డిసెంబర్ లో కనిపించారు. ఇక ఈమెను క్లెమ్లిన్ మీడియా చైర్మన్ గా పుతిన్ నియమించి ఏకంగా 8 మిలియన్ల వేతనం అందిస్తున్నట్టు భోగట్టా. దాంతో ఈమె లగ్జరీ లైఫ్ గడుపుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.
Tags:    

Similar News