పీ.వీ. నరసింహారావు బయోపిక్.. జూన్ 28న రిలీజ్!

Update: 2021-06-28 09:30 GMT
దివంగ‌త ప్ర‌ధాన మంత్రి పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు జీవితం వెండి తెర‌పై ఆవిష్కృతం కాబోతోంది. ఈ బ‌యోపిక్ ను ఎన్టీఆర్ ఫిల్మ్స్ ప‌తాకంపై నిర్వ‌హించేందుకు నిర్మాత తాడివాక ర‌మేష్ నాయుడు సిద్ధ‌మ‌య్యారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ధ‌వ‌ల స‌త్యం ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే స్క్రిప్టు వ‌ర్క్ పూర్త‌యింది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. తెలుగు, హిందీతోపాటు ప్ర‌ముఖ భార‌తీయ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే.. పీవీ పాత్ర‌లో న‌టించే న‌టుడికోసం వెతుకుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న యాక్ట‌ర్ ను సెల‌క్ట్ చేసుకోవాల‌ని మేక‌ర్స్ చూస్తున్నారు.

న‌టీన‌టుల‌ను, టెక్నీషియ‌న్స్ ను ఫైన‌ల్ చేసి.. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇవాళ పీవీ న‌ర‌సింహారావు జ‌యంతి అన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఇదే రోజున చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

కాగా.. తెలంగాణ‌లో జ‌న్మించిన పీవీ న‌ర‌సింహారావు.. భార‌త ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టి ఎన్నో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టారు. ఆయ‌న చేప‌ట్టిన‌ నూత‌న ఆర్థిక విధానాల ఫ‌లితంగానే.. దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెను మార్పులు వ‌చ్చాయ‌ని చెబుతారు ప‌లువురు. ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య త‌ర్వాత ఏర్ప‌డిన‌ ప‌రిస్థితుల కార‌ణంగా.. ఊహించ‌ని రీతిలో పీవీ ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్టారు. 1991 నుంచి 96 వ‌ర‌కు ప్ర‌ధానిగా సేవ‌లు అందించారు.
Tags:    

Similar News