హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ఘనతను తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. అయితే ఈ దఫా తన ఆటతో కాకుండా...తన సంపాదనతో ఆమె ఈ ప్రపంచ గుర్తింపును సంపాదించారు. ప్రపంచంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న మహిళా ప్లేయర్స్ జాబితాలో చోటు సంపాదించింది. 2018 ఏడాదికిగాను ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో సింధు చోటు సంపాదించుకున్నారు. 85 లక్షల డాలర్లు సుమారు రూ.59 కోట్లు సంపాదనతో సింధు ఏడోస్థానంలో నిలిచింది. వరుసగా మూడో ఏడాది కూడా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా టాప్ టెన్‌లో ఇద్దరు తప్ప మిగతా అందరూ టెన్నిస్ ప్లేయర్సే కావడం విశేషం.
నంబర్ వన్‌గా నిలిచిన సెరెనా ఏడాది సంపాదన 1.81 కోట్ల డాలర్లు (సుమారు రూ.125 కోట్లు)గా ఉంది. 85 లక్షల డాలర్లతో సింధు ఏడో స్థానంలో నిలిచింది. ఇలాంటి జాబితాల్లో భారత్ నుంచి టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ సింధునే కావడం గమనార్హం. నోకియా - పానసోనిక్ - బ్రిడ్జిస్టోన్ - గటోరేడ్ - రెక్కిట్ బెంకిసెర్ తో పాటు మరికొన్ని టాప్ బ్రాండ్ లతో సింధుకు వాణిజ్య ఒప్పందాలున్నాయని ఫోర్బ్స్ ప్రకటనలో వివరించింది.
గతేడాది సెప్టెంబర్ లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ ఏడాది మార్చిలో సెరెనా మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టింది. టోర్నీల్లో గెలవడం ద్వారా ఆమె కేవలం 62 వేల డాలర్లు మాత్రమే సంపాదించినా.. ఎండార్స్ మెంట్ల ద్వారా 1.81 కోట్ల డాలర్లు ఆర్జించడం విశేషం. ఈ విషయంలో ఏ మహిళా ప్లేయర్ ఆమె దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. సెరెనా తన కెరీర్‌లో టెన్నిస్ కోర్టులో సంపాదించిన దాని కంటే రెట్టింపు బయట సంపాదించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. వీరితోపాటుగా టాప్ టెన్‌లో ఉన్న మరో టెన్నిసేతర ప్లేయర్ డానికా పాట్రిక్ మాత్రమే. రూ.52 కోట్ల సంపాదనతో ఆమె 9వ స్థానంలో ఉంది.
ఫోర్బ్స్ జాబితా ఇది
1. సెరెనా విలియమ్స్ - 18.1 మిలియన్ల డాలర్లు
2. కరోలిన్ వోజ్నియాకి - 13 మిలియన్ల డాలర్లు
3. స్లోనే స్టిఫెన్స్ - 11.2 మిలియన్ల డాలర్లు
4. గార్బైన్ ముగురుజా - 11 మిలియన్ల డాలర్లు
5. మరియా షరపోవా - 10.5 మిలియన్ల డాలర్లు
6. వీనస్ విలియమ్స్ - 10.2 మిలియన్ల డాలర్లు
7. పీవీ సింధు - 8.5 మిలియన్ల డాలర్లు
8. సిమోనా హలెప్ - 7.7 మిలియన్ల డాలర్లు
9. డానికా పాట్రిక్ - 7.5 మిలియన్ల డాలర్లు
10. ఎంజెలిక్ కెర్బర్ - - 7 మిలియన్ల డాలర్లు