స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. భారత తరపున బ్యాడ్మింటన్ క్రీడలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింధు దిగ్గజ టోర్నీల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించి పతకాలను సాధించి ఎన్నోసార్లు త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడింది. ఈ క్రమంలోనే 2022 ఫోర్బ్స్ జాబితాలో సింధు చోటు దక్కించుకోవడం విశేషం.
అద్భుతమైన ఆట తీరును అందరినీ ప్రశంసలను దక్కించుకుంటున్న సింధు సంపాదనలో దూసుకెళుతోందని ఫోర్బ్స్-2022 జాబితా చూస్తే అర్థమవుతుంది. ప్రతి యేటా మాదిరిగానే ఫోర్బ్స్ ఈ ఏడాది అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. మహిళా అథెట్ల టాప్ 25 జాబితాలో పీవీ సింధు 12వ స్థానాన్ని దక్కించుకొని సత్తా చాటింది.
ఈ ఏడాది పీవీ సింధు మొత్తం సంపాదన 71 లక్షల డాలర్లు. ఇందులో బ్యాడ్మింటన్ కోర్టు బయట సంపాదనే 70 లక్షల డాలర్లు కావడం విశేషం. కాగా ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ పీవీ సింధు సింగిల్స్ లో గోల్డ్.. డబుల్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది. ఈ విజయాలతో కోర్టు బయట సైతం ఆమె మార్కెట్ మరింత పెరిగింది.
ఫోర్బ్స్ ప్రకటించిన మహిళా అథెట్ల జాబితాలో టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆమె ఏకంగా 5.11 కోట్ల డాలర్లు ఆర్జించింది. రెండో స్థానంలో అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ఉంది. ఆమె సంపాదన 4.13 కోట్ల డాలర్లు. టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్ ఇగా స్వియాటెక్ ఈ జాబితాలో ఐదోస్థానంలో ఉంది.
ఈ జాబితాని పరిశీలిస్తే.. టాప్ అథ్లెట్లకు ఆయా స్పోర్ట్స్ టోర్నీల్లో వచ్చే ప్రైజ్‌మనీల కంటే బయట స్పాన్సర్‌షిప్స్.. అంబాసడర్‌షిప్స్ వల్లే అత్యధిక ఆదాయం వస్తుందని అర్థమవుతోంది. ఈ జాబితాలో ఎప్పటిలాగే టెన్నిస్ ప్లేయర్స్ టాప్‌లో ఉండగా టాప్ 25లో 12 మంది టెన్నిస్ ప్లేయర్సే ఉన్నారు. టాప్ 10లో ఏడుగురు టెన్నిస్ ప్లేయర్స్ ఉండటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.