ఒలింపిక్స్ పతకం కల చెదిరింది.. సిందూ ఓడిపోయింది

Update: 2021-07-31 12:39 GMT
ఒలంపిక్స్ లో పీవీ సింధూ కల చెదిరింది. ఈసారి బ్యాడ్మింటన్ లో ఖచ్చితంగా పతకం ఖాయమనుకున్న వారికి షాక్ తగిలింది. తొలి గోల్డ్ మెడల్ ను మన పీవీ సింధూ అందిస్తుందని కలలుగన్న వారికి నిరాశ ఎదురైంది.

వరుస విజయాలతో బ్యాడ్మింటన్ సెమీస్ లోకి దూసుకొచ్చిన తెలుగుతేజం సెమీస్ పోటీలో ఓడిపోయింది. కెరీర్ లో తనకు కొరకరాని కొయ్యగా మారిన జైజూ యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పీవీ సింధూ ఓడిపోయింది.

శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరో సీడ్ సింధూ 18-21,12-21 తేడాతో వరల్డ్ నెంబర్ 1 తైజు యింగ్ చేతిలో వరుస గేమ్స్ లో ఓడిపోయింది. సింధూ ఇక కాంస్య పతకం కోసం జరిగే పోరులో చైనా ప్లేయర్ హే బింగ్ జియోతో ఆదివారం తలపడనుంది.

ప్రారంభంలో మన పీవీ సింధు సత్తా చాటింది. ఓపెనింగ్ గేమ్ లోనే 2-0తో వెనుకబడిన వెంటనే తైజు తప్పిదాలతో సింధూ 2-2తో సమం చేసింది. ఆ తర్వాత ఓవర్ హెడ్ స్మాష్ తో 4-2 లీడ్ లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత తైజు యింగ్ రెచ్చిపోయింది. 11-8తో సింధూను ఓవర్ టేక్ చేసింది. సింధూ అనవసర తప్పిదాలు చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి.

డ్రాప్ షాట్స్ తో చెలరేగిన తైజాయింగ్ లీడ్ కు వెళ్లినా.. ఆ తర్వాత ఆమె అనవసర తప్పిదాలతో సింధు రేసులోకి వచ్చింది. కానీ తైజు కూడా చెలరేగడంతో స్కోర్లు 14-14తో సమమయ్యాయి. ఆ తర్వాత తైజాయింగ్ డ్రాప్ షాట్స్ తో పాయింట్లు సాధించగా.. సింధూ స్మాష్ లతో చెలరేగింది. గేమ్ హోరాహోరీగా సాగింది.

కానీ చివర్లో బాడీ లైన్ స్మాష్ లతో వరుసగా పాయింట్లు సాధించిన తైజాయింగ్ 21-18తో గేమ్ ను సొంతం చేసుకుంది. దీంతో సిందూ ఓటమికి పాలైంది.


Tags:    

Similar News