నటుడు ఆ తర్వాత కాలంలో బడా నిర్మాతగా అవతారమెత్తి.. ప్రముఖ కథానాయకులతో సినిమాలు చేసిన బండ్ల గణేశ్ ఇటీవల అరెస్ట్ కావటం తెలిసిందే. టెంపర్ సినిమా నిర్మాణం విషయంలో బండ్ల గణేశ్ కు పీవీపీ మధ్య భారీ వివాదం రగలటమే కాదు.. ఈ విషయం మీద గడిచిన ఐదారేళ్లుగా రచ్చ నడుస్తోంది. చెక్ బౌన్స్ కేసులో కడప కోర్టు బండ్ల గణేశ్ కు 14 రోజులు రిమాండ్ కు తరలించటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ కు తనకు మధ్యనున్న వివాదం గురించి పీవీపీ పెదవి విప్పారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ కు సంబంధించిన విషయాలతో పాటు..తానునిర్మించిన బ్రహ్మోత్సవం సినిమా గురించి.. ప్లాప్ అయిన ఆ సినిమా తనకెంత లాభాలు తీసుకొచ్చిందన్న ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
సినిమా బిజినెస్ లో లాభనష్టాలు సాధారణమని.. అయితే టెంపర్ సినిమా వ్యవహారంలో బండ్ల గణేశ్ విషయంలో తమకు ఎదురైన వివాదం ఇబ్బందిని కలిగించిందని చెప్పారు. ఆ సినిమా కోసం తాము రూ.30 కోట్లు ఫైనాన్స్ చేస్తే.. రూ.23 కోట్లు తిరిగి ఇచ్చారని.. మిగిలిన రూ.7 కోట్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చారన్నారు. ఐదేళ్లు గడిచినా ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని.. నోటీసులు పంపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనుకున్నామన్నారు. కోర్టు కేసుల్లో భాగంగా తమతో చర్చలు జరిపేందుకు ముగ్గురు మనుషుల్ని బండ్ల గణేశ్ పంపారని.. ఆ సమయంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు.
బండ్ల గణేశ్ మీద 58 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని.. తమ మీద ఒక్క చెక్ బౌన్స్లేదన్నారు. వందలమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పిన పీవీపీ.. తమకు ఇవ్వాల్సిన డబ్బును ఎప్పటికైనా వడ్డీతో సహా చెల్లించాల్సిందేనన్నారు. ఈ క్రమంలోనే అరెస్ట్ అయ్యాడన్నారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న పీవీపీ.. బండ్ల గణేవ్ మంత్రి బొత్స సత్యనారాయణకు బినామీ అన్న విషయం తనకు తెలీదన్నారు. ఆ విషయం మీద తనకు మాట్లాడటం ఇష్టం లేదన్నారు. తమ వివాదంలో బొత్స ఎప్పుడూ మాట్లాడలేదన్నారు.
సినిమా ఏదైనా ఆడకపోతే దర్శకుడు కెరీర్ పరంగా నష్టపోతాడని.. నిర్మాత మాత్రం ఆర్థికంగా నష్టపోతారన్నారు. దర్శకుడు ఒక సినిమా ఫ్లాప్ అయినా.. మరో సినిమా అవకాశం ఇచ్చే నిర్మాత ఉంటారని.. కానీ నిర్మాత ఆర్థికంగా నష్టపోతే మాత్రం ఆదుకునేవారే ఉండరన్నారు. బ్రహ్మోత్సవం మూవీకి ముందు తండ్రి కొడుకుల మధ్య నడిచే భావోద్వేగ కథగా చెప్పారని.. కానీ తెర మీద అలాంటిది కనిపించలేదన్నారు.
కథ చెప్పినప్పుడు మహేశ్ బాబుకు బాగా నచ్చిందని.. కాకుంటే చెప్పినట్లుగా సినిమాగా తీయలేదన్నారు. తెర మీద చెప్పిన కథ ప్రొజెక్టు కాకపోవటంతో సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదన్నారు. సినిమా ఏదైనా హిట్ అయినా ప్లాప్ అయినా దర్శకుడిదే బాధ్యత అన్న పీవీపీ.. ఈ సినిమా తర్వాత శ్రీకాంత అడ్డాల కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుచెప్పారు.
బ్రహ్మోత్సవం ప్లాప్ సినిమా అంటారు కానీ తనకు రూ.5 కోట్ల లాభాన్ని తెచ్చి పెట్టిందన్నారు. కానీ.. ఆ సినిమా కారణంగా నష్టపోయిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చామని.. ఆ తర్వాత తమ ఐదు సినిమాలు వారికి ఇచ్చి ఆదుకున్నట్లు చెప్పారు. మొత్తానికి బండ్ల గణేశ్ విషయంలో తమ తప్పు ఏమీ లేదని.. తప్పంతా బండ్లదేనన్న పీవీపీ మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.