మీడియాను వేదికగా చేసుకొని తమ రాజకీయ ప్రత్యర్థులపై దునుమానుడకునే రోజులు పోయాయి. ఎక్కడ ఉంటారో తెలీదు.. ఏం చేస్తుంటారో అస్సలు బయటకు రాదు. ఏం ఆలోచిస్తారన్న దానికి అంతుపట్టని రీతిలో వ్యవహరిస్తూ.. తమ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా పంచ్ లు వేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.
సోషల్ మీడియాతో ప్రజాదరణతో పాటు.. ప్రత్యర్థులకు పంచ్ లు వేసే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతంలో నేతలు మాట్లాడిన మాటల్ని ఎఫెక్టివ్ తగ్గకుండా.. సరైన ప్రాధాన్యత ఇస్తూ వార్తల్ని క్యారీ చేసే అవకాశం ఉండేది కాదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఆ లోటు తీరిపోయింది. తామేం అనుకుంటే దాన్ని పోస్ట్ చేయటం ఇప్పుడో అలవాటుగా మారింది.
గతానికి భిన్నంగా వైరల్ అయిన విషయాల్ని వార్తలు ఇచ్చే పరిస్థితి మీడియాలో నెలకొంది. ఒకప్పుడు తానే వార్తలకు వేదికగా ఉండే మీడియా.. ఇప్పుడు సోషల్ మీడియాలో చోటు చేసుకునే పరిణామాల్ని వార్తలుగా వేసుకోవాల్సి వస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా సొంత పార్టీ మీదా.. ప్రత్యర్థులపైనా సటైర్లు వేస్తూ.. వార్తల్లో నిలిచిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి కౌంటర్లు వేస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత పీవీపీ.
నాని.. పీవీపీ మధ్యనున్న రాజకీయ శత్రుత్వం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తన ప్రత్యర్థి కేశినేని నానిపై చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. ఎక్కడా నాని పేరును ప్రస్తావించకుండా.. తన ట్వీట్ చదివినంతనే ఎవరిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారన్న విషయం అర్థమయ్యేలా ట్వీట్ చేసి సంచలనంగా మారారు పీవీపీ.
కసాయి వాడికి గొర్రె మీద ఉన్న ప్రేమ కూడా నీకు నీ దగ్గర పని చేసే కార్మికుల మీద లేదే? వేలాదిమంది పొట్ట కొట్టి ఈ రోజు నువ్వు అందలమెక్కి కూర్చున్నావు! కడుపుకాలి.. ఆ కడుపు మంటతో.. రోడ్డెక్కిన వేలాది కుటుంబాలను మనసుంటే ఆదుకో.. లేదంటే సంకనాకిపోతావు.. నీ బాస్ లాగా అంటూ.. వేసిన పంచ్ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేశినేని ట్రావెల్స్ ను మూసివేతకు ముందు నుంచి సిబ్బందికి జీతాలు ఇవ్వలేదన్న ఆరోపణ నాని మీద ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మధ్యలో నాని బాస్ బాబును కోట్ చేస్తూ వేసిన పంచ్ తో పీవీపీ ప్రత్యర్థి నోటి నుంచి మాట రాని పరిస్థితి ఖాయమంటున్నారు. మరి.. నాని ఎలా రియాక్ట్ అవుతారో?-