ఈమద్య కాలంలో తెలుగు నిర్మాతలు బండ్ల గణేష్ మరియు ప్రసాద్ వి పొట్లూరిల మద్య మాటల యుద్దం సోషల్ మీడియా వేదికగా శృతిమించిన విషయం తెల్సిందే. తన డబ్బులు ఇవ్వడం లేదు అంటూ పీవీపీ కేసు పెట్టడం బండ్ల గణేష్ అరెస్ట్ అవ్వడం కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడిన పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఒక మద్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని. కష్టపడి డబ్బు సంపాదించాను. విదేశాలకు వెళ్లాలనే ఆసక్తితో నేను ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ టాయిలెట్లు కూడా కడిగానంటూ చెప్పుకొచ్చాడు. కష్టపడి సంపాదించిన సొమ్ము విషయంలో నేను పక్కాగా ఉంటానంటూ పేర్కొన్నాడు.
బండ్లతో వివాదం గురించి మాట్లాడుతూ టెంపర్ సినిమా కోసం దాదాపు 30 కోట్ల రూపాయలను నా నుండి తీసుకున్నాడు. ఎన్టీఆర్ హామీ ఇవ్వడంతో సినిమా విడుదలకు ఒప్పుకున్నాను. ఆ తర్వాత డబ్బుల కోసం అడుగుతూ ఉంటే తప్పించుకు తిరుగుతున్నాడు. ఒక రోజు హోటల్‌లో కలిసిన సమయంలో డబ్బుల విషయం తీసుకు రాగా నాతో పెట్టుకుంటే గెలువలేవు అన్న అంటూ కాస్త సీరియస్ గా నన్ను హెచ్చరించాడు. దాంతో ఆయనపై కేసు పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
ఎవరి వద్దనైనా బాకీ తీసుకున్నప్పుడు వాటిని ఎప్పటికైనా చెల్లించాల్సిందే. ఆయన కాకపోతే ఆయన మనవడి నుండైనా నేను డబ్బులు రాబట్టుకోగలను. ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తూ బాకీ ఎలా మాఫీ అయిపోతుంది. అవసరం అయితే ముక్కు పిండి మరీ వసూళ్లు చేసుకుంటాను. నాకు రావాల్సిన ప్రతి పైనాను వసూళ్లు చేసుకునే వరకు నేను ఊరుకోనంటూ చెప్పుకొచ్చాడు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందనే నమ్మకం నాకుందని ఆయన నుండి నాకు రావాల్సిన డబ్బులు వస్తాయంటూ పీవీపీ నమ్మకంగా ఉన్నాడు. అనవసరమైన పనులు చేయడం వల్ల బండ్ల గణేష్ తన గోతిని తానే తవ్వుకున్నాడంటూ పీవీపీ కామెంట్ చేశాడు. పీవీపీ కామెంట్స్ కు బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.