ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేతల ఎదురుదాడి ఊపందుకుంది. గత రెండు రోజులుగా బీజేపీ నేతలు వరుసగా వైసీపీ ప్రభుత్వం పైనా - అదే విధంగా సీఎం జగన్ పైనా ఆరోపణలు - విమర్శలు చేస్తున్నారు. ఓవైపు జగన్ కేంద్రంలో బీజేపీ సర్కార్ తోనూ - అందులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ - హోంమంత్రి అమిత్ షాతో సఖ్యతతో ఉంటుంటే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జగన్‌కు పెద్ద పీట వేస్తుంటే... రాష్ట్రంలో మాత్రం వైసీపీపై దుమ్మెత్తిపోస్తుంది...
ఇప్పుడు ఏకంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి మాణిక్యాలరావు ఏపీ సీఎం జగన్ పైనే గన్ పేల్చారు. జగన్ ను నీరో చక్రవర్తిగా అభివర్ణించడం వరకు వెళ్లాడు. అంటే జగన్ నీరో చక్రవర్తిగా మారాడంటే ఏపీలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందనే అభిప్రాయమన్నమాట. జగన్ ఏపీలో క్రైస్తవ మతానికి పెద్ద పీట వేస్తున్నాడని - దేవాదాయ భూములను క్రైస్తవులకు ఇచ్చేందుకు - చర్చీలు నిర్మించేందుకు సర్కారు నిధులను ఇచ్చేందుకు పూనుకుంటున్నాడని ఇది సరికాదని మాణిక్యాల రావు విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక క్రిస్టియన్ లిబరేషన్ ఆర్మీ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారని - ఆర్మీ పేరుతో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని డీజీపీని కలిసి పిర్యాదు చేస్తానని మాణిక్యాలరావు బాంబు పేల్చారు. ఇక హిందూ దేవాలయాలకు చెందిన భూములను క్రిస్టియన్‌లకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సరికాదని ఆయన జగన్‌కు హితువు పలకడం విశేషం. ఏదేమైనా జగన్ పై బీజేపీ ఎటాక్ రోజు రోజుకు పెరిగిపోతోంది. పాత బీజేపీ నాయకుల నుంచి కొత్త బీజేపీ నాయకుల వరకు జగన్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ రెండు పార్టీల నాయకుల విమర్శలు - ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కనుంది.