స్నేహితుల కోసం చెల్లిని చంపేశాడు

Update: 2016-07-31 10:46 GMT
సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీ - పాకిస్తాన్‌ మోడల్ ఖందీల్ బలోచ్ హ‌త్య ఉదంతంలో కొత్త కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆమెను సోద‌రుడు వ‌సీం చంపిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య ఎపిసోడ్ లో ఇప్ప‌టివ‌ర‌కు బ‌లోచ్ సోద‌రుడు - ఆమె తండ్రి స్పందించ‌గా ఇపుడు త‌న త‌ల్లి మీడియాతో మాట్లాడింది. స్నేహితుల కారణంగానే  బలోచ్‌ ను ఆమె సోదరుడు వసీం చంపేశాడని ఆమె తల్లి అన్వర్‌ వాయి చెప్పింది.

బలోచ్‌ తమ ఇంటికి అపఖ్యాతి తీసుకొస్తుందని స్నేహితులు వసీంను అవమానించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది.గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లో చెల్లి ప‌రువు తీస్తుంద‌ని త‌మ‌తో వాదించేవాడ‌ని, తాజాగా సొంత ఊరికి వ‌చ్చిన స‌మ‌యంలో ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని వాపోయింది. త్వ‌ర‌లో ఆమె విదేశాల్లోనే స్థిర నివాసం ఏర్పాటుచేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న స‌మ‌యంలో ఈ హ‌త్య జ‌రిగింద‌ని రోదించింది.  బలోచ్‌ ఆర్థికపరంగా అండగా ఉండేదని, కుమారుల కంటే గొప్పగా చూసుకునేదని ఆమె తల్లి వెల్లడించింది. బలోచ్‌ చనిపోవడంతో పెద్దదిక్కును కొల్పోయామని తల్లి వాపోయింది.
Tags:    

Similar News