తెలంగాణలో ‘ముందస్తు’ వేడి రగులుకుంది. ఈ నేపథ్యంలో జంపింగ్ జపాంగ్ లు జోరందుకున్నారు. రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. అసమ్మతి నేతలు తమ భవిష్యత్ కోసం పార్టీలను వెతుక్కుంటున్నారు. ఇప్పటికే టీఆర్ ఎస్ లో అసమ్మతి సెగలు రాజుకున్న సంగతి తెలిసిందే..
అధికార టీఆర్ ఎస్ ను ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. దీనికోసం మహాకూటమికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తోంది. కానీ కాంగ్రెస్ - టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ మహాకూటమిని వ్యతిరేకిస్తున్నారు. ఈ పొత్తుల తక్కెడలో తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో కాంగ్రెస్ - టీడీపీలు తమ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డాయి.
టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే - బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అలకబూనారని సమాచారం. పొత్తుల వ్యవహారంలో చంద్రబాబు తన పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత కృష్ణయ్యను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కూడా పొత్తుల వ్యవహారంలో కృష్ణయ్యను బాబు లైట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆర్. కృష్ణయ్య తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులు - కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
తాజాగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు గురించి కనీసం ఒక్కమాటైనా తనతో చెప్పలేదని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కాపులు - బీసీలను మోసం చేశారని మండిపడ్డారు.
కాగా.. టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కృష్ణయ్య ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. రాజీనామా చేసి వేరే పార్టీలోకి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.