ఏపీ స‌ర్కారుపై ఆర్ ఆర్ ఆర్ హాట్‌ కామెంట్స్‌.. ఏమ‌న్నారంటే!

Update: 2022-01-25 11:30 GMT
ఏపీ ప్ర‌భుత్వంపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌ మ‌రోసారి ఫైర్ అయ్యారు. ఏపీలోని గ్రామ సచివాలయాల ఏర్పాటు పెద్ద కుంభకోణమని ఆరోపించారు. మీడియాతో మంగ‌ళ‌వారం ఆయన మాట్లాడారు. ప్రజలు జగన్‌రెడ్డి పరిపాలిస్తారని ఓట్లు వేస్తే పత్రికల్లో పనిచేసేవారిని తీసుకొచ్చి పాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యోగులతో చ‌ర్చ‌ల కోసం వేసిన క‌మిటీలో స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డిని ఎందుకునియ‌మించార‌ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రికి ఏ హ‌క్కు ఉంద‌ని స‌జ్జ‌ల‌ను నియ‌మించార‌ని అన్నారు.

ఉద్యోగుల‌కు చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌కుండా.. ఉండ‌డం స‌రైన చ‌ర్యేన‌ని చెప్పారు. ఇక‌, ఉద్యోగ సంఘాల నాయ‌కు లు.. ఆదిలో జ‌గ‌న్ మాట‌ల‌కు న‌మ్మి.. మురిసిపోయార‌ని అన్నారు. జ‌గ‌న్‌తో జ‌రిగిన స‌మావేశంలో వీరంతా ఒప్పుకొన్న త‌ర్వాత ఇప్పుడు.. వాస్త‌వాలు గ్ర‌హించార‌ని.. చెప్పారు. ఒక్క‌సారి స‌జ్జ‌ల ఉన్న క‌మిటీతో చ‌ర్చ లకు వెళ్తే.. ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని వారు భావిస్తున్నార‌ని.. `శివాజీ` సీన్ త‌ర‌హా రిపీట్ అవుతుంద‌ని ఉద్యోగులు భావిస్తున్నారు అని ఆర్ ఆర్ ఆర్ చెప్పాడు. అసలు హైకోర్టులో కేసు వేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు.

కేసుతో సంబంధం లేని ఉద్యోగ సంఘాల నేతలను కోర్టుకు పిలవడమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో జడ్జిల జీతాలు ఒక్క రూపాయి చేస్తానని కేంద్ర ప్ర‌భుత్వం అంటే.. కోర్టులో న్యాయ‌మూర్తులు తీర్పు ఇస్తే న్యాయమూర్తులు ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. పంచాయతీల నిధులను గ్రామ సచివాలయాలకు వాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం తప్పని ఆయన పేర్కొన్నారు. నాటకాలను నిషేధించి వాటిపై ఆధారపడ్డ కళాకారుల పొట్ట కొట్టవద్దని ఆయన హితవు పలికారు. జీవో వెనక్కి తీసుకోకపోతే కళాకారుల తరపున కోర్టులో పిల్ వేస్తానని రఘురామ తెలిపారు.  

ఈ సంద‌ర్భంగా టీచ‌ర్ల‌ను అవ‌మానిస్తూ.. కొంద‌రు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ర‌ఘురామ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశా రు. టీచ‌ర్ల విధి నిర్వ‌హ‌ణ‌లో ఎక్క‌డైనా త‌ప్పులు జ‌రిగి ఉంటే.. ఖ‌చ్చితంగా స‌రిదిద్దుకునే అవ‌కాశం ఇవ్వా ల‌న్నారు. గ‌తంలో అసెంబ్లీలోనే సీఎం జ‌గ‌న్‌, స‌మాచార మంత్రి పేర్ని నాని కునుకుపాట్లు ప‌డుతున్న దృశ్యాల‌ను మీడియాకు చూపించారు. ఉద్యోగులు చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌డం మంచిది కాద‌ని.. అన్నారు ఒక‌వేళ చ‌ర్చ‌ల‌కు వెళ్లాలంటే.. మంత్రుల‌నే మీ వ‌ద్ద‌కు ర‌ప్పించుకుని చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని లేక‌పోతే బెదిరింపుల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.


Tags:    

Similar News