పీకే మీద మాజీ సీఎం సంచలన వ్యాఖ్య

Update: 2019-04-13 08:21 GMT
రాజకీయ వ్యూహకర్తగా.. పోల్ మేనేజ్ మెంట్ లో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ కిశోర్ ఆ మధ్య జేడీయూలో చేరటం తెలిసిందే. ఏదో అంశంపై తరచూ వార్తల్లో ఉండే ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. తాజాగా కొత్త తరహాలో ఆయన పేరు బయటకు వచ్చింది. ఆయన్ను ఉద్దేశించి బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్జేడీని జేడీయూలో విలీనం చేయాలని పీకే ప్రతిపాదించినట్లుగా రబ్రీదేవి పేర్కొన్నారు. ఈ విలీనం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ప్రధానమంత్రిగా ప్రకటించొచ్చని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ తరఫున ఆయన తమను కలిశారని.. రెండుపార్టీలను విలీనం చేసి ప్రధాని అభ్యర్థిగా లాలూను ప్రతిపాదించాలని ఆయన చెప్పారని.. ఆ  సందర్భంలో తనకు చాలా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లాలని చెప్పినట్లు వెల్లడించారు. జేడీయూలో చేరక ముందు పీకే అనేక పర్యాయాలు లాలూతో భేటీ అయిన విషయం వాస్తవమే అని చెప్పారు. అప్పట్లో తాము మాట్లాడుకున్న విషయాలు వెల్లడిస్తే.. పీకే ఇబ్బందుల్లో పడతారని పేర్కొనటం గమనార్హం. అదేదో చెప్పేస్తే సరిపోతుందిగా?
Tags:    

Similar News