కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేల అందరూ ఇళ్లల్లో కూర్చున్న కూడా పోలీసులు మాత్రమే కరోనా కి ఎదురొడ్డి , ఎర్రటి ఎండలో సైతం ప్రాణాలని పనంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసులు కొంచెం కఠినంగా ఉంటారు అని అందరూ అంటుంటారు. వారు చేసే పనిలో కొన్ని సందర్భాల్లో అలా వ్యవహరిస్తేనే సమాజం నేరరహితంగా ఉంటుంది.
అయితే, బుధవారం ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కోహెడలో నూతనంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వల్ల ఇక్కడ పలు ఏర్పాట్లు, రక్షణ చర్యలను పర్యవేక్షించడానికి పోలీసులు కూడా వచ్చారు. ఈ ప్రాంతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో ఆ ప్రాంత పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయన వచ్చే టైం కే పండ్ల మార్కెట్‌లోని మామిడి పంట అంతా రాసులు రాసులుగా పోసి ఉంది. అవతలి వైపునకు కింది స్థాయి సిబ్బంది, ఇతర అధికారులు వాటిపై నుంచీ అలాగే వెళ్లిపోయారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాత్రం అలా కాకుండా తన బూట్లు విడిచి , పండ్లపై చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ విడిచిన బూట్లను చేతితో పట్టుకొని ముందుకెళ్లారు. రైతు కష్టపడి పండించిన పంట.. అంతేకాకుండా అందరూ తినే పదార్థం అని భావించి కమిషనర్ ఇలా వ్యవహరించారు. తన మృదుస్వభావం, మంచి మనసును సీపీ ఇలా చాటుకున్నారు. ఇంత పెద్ద హోదాలో ఉండి కూడా ఆయన చేసిన పనిని చూసి చాలా మంది అయన పై ప్రశంసలు కురిపించారు.