ర‌ఘునంద‌న్ నుంచి ప్రాణ‌హాని ఉంద‌న్న రాధార‌మ‌ణి!

Update: 2020-02-04 16:16 GMT
భారతీయ జనతా పార్టీ నేత - లాయర్ రఘునందన్ రావుపై రాధారమణి అనే మ‌హిళ చేసిన లైంగిక ఆరోప‌ణ‌లు పెను దుమారం రేపుతున్నాయి. రఘునందన్ త‌న‌ను లోబ‌ర్చుకున్న విధానం - బ్లాక్ మెయిల్ చేయ‌డంపై రాధార‌మ‌ణి మీడియా సాక్షిగా వెల్ల‌డించారు. 2003లో త‌న భర్త వెంకటేశ్వర్ రావు పై ఆర్సీ పురం పీఎస్‌ లో ఫిర్యాదు చేశాన‌ని - ఈ కేసు వ్య‌వ‌హారంలో 2007లో లాయర్ రఘునందన్‌ ను కలిశానని చెప్పారు. కాంప్రమైజ్ పేరుతో త‌న‌ను పటాన్‌ చెరులోని ఇంటికి పిలిపించిన ర‌ఘునంద‌న్ కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశార‌ని ఆరోపించారు. త‌న మాజీ భర్త వెంకటేశ్వర్ రావు సహకారంతోనే లైంగిక దాడికి పాల్పడ్డ ర‌ఘునంద‌న్ - అత్యాచార దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించి నోరు మూయించార‌ని రాధార‌మ‌ణి వాపోయారు.

ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ రఘునందన్ త‌నపై పలుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌డ‌ని రాధార‌మ‌ణి ఆరోపించారు. వెంకటేశ్వర్‌ రావు - రఘునందన్‌ లు కలిసి శ్రీనివాస్ అనే వ్యక్తితో త‌న‌కు పెళ్లిచేశారని - ఆ తర్వాత శ్రీనివాస్ పైన ఎస్ ఆర్‌ నగర్‌ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆ కేసులో ఆధారాలను పోలీసులు - రఘునందన్‌  మార్చేశారని ఆరోపించారు. వెంకటేశ్వరరావు - శ్రీనివాస్ - రఘునందన్ లు కలిసి వ్యభిచార ముఠాలను నడిపిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.కేసుల కోసం వచ్చే ఆడవారిని లోబ‌రుచుకొని వారితో బ్లూ ఫిలింస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తాడని సంచలన ఆరోపణలు చేశారు. ఓ ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లైయ్ చేసేది రఘునందనే అని ఆరోపించారు. తా తప్పు చేస్తే ఉరి తీయాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  రఘునంద‌న్ వల్ల త‌న‌కు, త‌న‌ కుమారుడికి ప్రాణహాని ఉందన్నారు. ర‌ఘునంద‌న్ వ్య‌వ‌హారంలో హెచ్ఆర్సీని ఆశ్రయించానని తెలిపారు.

రాధార‌మ‌ణి ఆరోపణలపై రఘునందన్‌ స్పందిచారు. రాధార‌మ‌ణి చేస్తున్న ఆరోపణలను నూటికి నూరు శాతం అవాస్తవాల‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పటి వరకు త‌న‌కు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని, తాను ఏ నేరం చేయలేదని అన్నారు.  ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలీదని, పూర్తి వివరాలను తెలుసుకుని దీనిపై స్పష్టతనిస్తాన‌ని చెప్పారు.
Tags:    

Similar News