ప్రియుడితో జంపింగ్‌కి కిడ్నాప్ క‌ల‌ర్‌

Update: 2015-07-13 06:10 GMT
పెళ్లికి ముందు ప్రేమ‌ల్ని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. పెళ్లి అయిన త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ‌టం.. పిల్ల‌ల్ని వ‌దిలేసి త‌మ దారి తాము చూసుకునే వాళ్లు చాలామంది ఉంటారు. ఇదొక్క మ‌హిళ‌లే కాదు.. పురుషులూ త‌క్కువ తిన‌లేదు. గ‌తంలో పురుషులు మాత్ర‌మే ఇలాంటి విప‌రీతాల‌కు పాల్ప‌డితే.. ఈ మ‌ధ్యన మ‌హిళ‌లు అక్క‌డ‌క్క‌డ ఇలాంటి వ్య‌వ‌హారాలు వెలుగు చూస్తున్నాయి.

వారం క్రితం హైద‌రాబాద్ రాజేంద్ర‌న‌గ‌ర్‌కు చెందిన రాధిక అనే వివాహిత కిడ్నాప్ అయ్యార‌న్న వార్త క‌ల‌క‌లం రేపింది. డ‌బ్బు కోసం డిమాండ్ చేస్తున్నారంటూ భ‌ర్త పోలీసుల్ని ఆశ్ర‌యించ‌టం.. మ‌హాన‌గ‌రంలో వివాహిత కిడ్నాప్ కావ‌టాన్ని స‌వాలుగా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేప‌ట్టారు. చివ‌ర‌కు.. కిడ్నాప్ అయిన రాధిక‌ను.. ఆమెను కిడ్నాప్ చేసిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ విష‌యం మీద పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు వింటే ఎవ‌రికైనా విస్మ‌యం క‌ల‌గ‌క‌మాన‌దు. ఎందుకంటే.. వివాహిత రాధిక‌కు..భ‌ర్త‌తో కొన్ని విభేదాలున్నాయి. ఇదే స‌మ‌యంలో 2011లో రిజ్వాల్ అనే వ్య‌క్తితో సోష‌ల్ నెట్ వ‌ర్క్స్‌లో ప‌రిచ‌య‌మ‌య్యారు. వారిద్ద‌రి బంధం బ‌ల‌ప‌డి.. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు.

ఇందుకోసం ఇంటి నుంచి పారిపోయిన వారు..కిడ్నాప్ నాట‌కానికి తెర తీశారు. చేతిలో డ‌బ్బుల్లేక‌.. భ‌ర్త‌ను బెదిరించ‌టం ద్వారా డ‌బ్బు సంపాదించాల‌ని భావించారు. రాధిక‌ను చిత్ర‌హింస‌లు చేసినట్లుగా డ‌మ్మీ గాయాల‌తో బెద‌ర‌గొట్టే ప‌ని చేశారు. నిజ‌మైన ప్రేమకు డ‌బ్బు అవ‌స‌రం ఉంటుందా? పెళ్లి చేసుకొని.. త‌న కుటుంబాన్ని విడిచి వెళ్లాల‌ని భావించే వారు.. డ‌బ్బుల కోసం ఇంత మోసానికి పాల్ప‌డాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. ఇక‌.. కిడ్నాప్ నాట‌కంలో భాగంగా వీరిద్ద‌రూ కోల్ క‌తాకు పారిపోయారు. పోలీసులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించటంతో అస‌లు గుట్టు ర‌ట్టు అయ్యింది.
Tags:    

Similar News