పాలపుంత నుంచి రేడియో తరంగాలు.. ఏలియన్స్ పనేనా?

Update: 2022-01-28 04:48 GMT
ఈ అనంత విశ్వంలో సమాధానం తెలియని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. నిజానికి అవి ప్రశ్న అని కూడా మనం గుర్తించలేని విధంగా ఉన్నాయి. కానీ కంటికి కంటపడిన నాడు అది మనకు ఓ అద్భతంలా కనిపిస్తుంది. ఇలాంటి దానినే కనుగొన్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. ఓ పాలపుంతలో విచిత్రమైన స్పిన్నింగ్ లాంటి వస్తువును గుర్తించారు. అయితే ఇలాంటిది ఇంత వరకు ఎన్నడూ చూడలేదని నిపుణులు చెప్తున్నారు. దీనిని ముందుగా గుర్తించింది మాత్రం ఓ డిగ్రీ చదివే విద్యార్థి కావడం గమనార్హం. తన ప్రాజెక్ట్ వర్కులో భాగం చేపట్టిన పరిశోధనలో ఇది ఉందని తేలింది. ఇందులో వింతైన విషయం ఏమిటంటే ఈ వస్తువు నుంచి ప్రతీ గంటకు కనీసం మూడు సార్లు రేడియో ధార్మిక శక్తి భూమి మీదకు వస్తుందని చెబుతున్నారు నిపుణులు.  

ఈ పరిశోధనలో ఇప్పటి వరకు పక్కగా తెలిసిన విషయం ఏమిటంటే  ప్రతి 18.18 నిమిషాలకు ఒకసారి ఆ పాల పుంత నుంచి రేడియో తరంగాలను బయటపడడం. అవి సరాసరి భూమండలం మీదకు వచ్చి పడుతున్నట్లు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నటాషా హర్లీ-వాకర్ చెప్పారు. విద్యార్థిని కనుగొన్న తర్వాత పరిశోధనకు నాయకత్వం వహించారు. మర్చిసన్ వైడ్‌ఫీల్డ్ అర్రే అని పిలువబడే పశ్చిమ ఆస్ట్రేలియా అవుట్‌ బ్యాక్‌లోని టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ వింతను కనుగొనినట్లు పరిశోధకులు తెలిపారు.

స్విచ్ ఆన్, ఆఫ్ లాంటి వస్తువులు మన అనంత విశ్వంలో చాలా ఉన్నాయని నటాషా తెలిపారు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా సరిగ్గా 18.18 నిమిషాలకు ఈ వస్తువు నుంచి ఓ ఫ్రీక్వెన్సీ భూమికి చేరుతుందని అన్నారు. ఈ వస్తువును కనుగొనడం ఒక ఖగోళ శాస్త్రవేత్తకి ఒక సవాలుతో కూడినదని ఆమె చెప్పారు. దీనికి కారణంగా ఇంత వరకు ఇలాంటిది లేకపోవడమే అని అన్నారు. పరిశోధన బృందం ఇప్పుడు వారు కనుగొన్న వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

తాజాగా కనుగొన్న వస్తువు భూమి నుంచి సుమారు 4,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. ఇది చాలా ప్రకాశవంతంగా ఉండడమే కాకుండా ఎంతో బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అయితే ఇంకా  దీనికి సంబంధించిన చాలా రహస్యాలు తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు నటాషా.

ఇది ఎప్పుడో విచ్ఛిన్నం అయిన నక్షత్రం తాలూకూ ఆనవాళ్లు అయ్యి ఉండవచ్చని అంచనా వేశారు. ఇది చాలా అసాధారణమైందిగా పేర్కొన్నారు. ఖగోళ శాస్త్రంలో ఇది ఎప్పుడూ చూడని వస్తువని తెలిపారు. దీనిని నుంచి వచ్చే రేడియో ధార్మిక తరంగాలు విశ్వంలోని మరే ఇతర గ్రహం నుంచి అయిన వస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇది కచ్చితంగా గ్రహాంతరవాసుల పని అనే ఆందోళన మరింత ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. కానీ ఇది అలాంటి దానిలా కనిపించడం లేదని చెబుతున్నారు. విడుదల అయ్యే రేడియో ధార్మిక తరంగాలు కొంత మేర సహజంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై చేసిన పరిశోధన నేచర్ జర్నల్ లో తాజాగా ప్రచురితం అయ్యింది.
Tags:    

Similar News