ఫస్ట్ టైం.. చిగురించిన పొలిటికల్ ప్రేమ

Update: 2019-11-17 08:04 GMT
రాజకీయం.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా బిజి బిజీ.. ఇంటి చుట్టూ కార్యకర్తలు నేతలు.. వందల సమస్యలు.. ఎమ్మెల్యేగా - ఎంపీగా అయితే ఇక తీరికే ఉండదు.. ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటే అసలు సొంత కుటుంబాన్నే పట్టించుకునే పరిస్థితి ఉండదు.. అందుకే మన రాజకీయ నేతలు తెలివిగా హౌస్ వైఫ్ లనే భార్యలుగా ఎంచుకుంటున్నారు. వీరు రాజకీయం వెలగబెడితే భార్యలు తమ రాజకీయ వారసులను తయారు చేస్తుంటారు.

సినిమాల్లో - క్రీడాకారుల్లో ఇతర రంగాల్లో వాళ్ల రంగంలోని వారినే పెళ్లి చేసుకోవడం మనం చూస్తుంటాం. డాక్టర్లు డాక్టర్లను - టీచర్లు టీచర్లను - ఉద్యోగులు ఉద్యోగులనే చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తుంటారు. కానీ ఒక్క రాజకీయ నేతలు మాత్రం ప్రేమకు దూరంగా ఉంటారు. వారిది ఎప్పుడూ బిజీ లైఫ్ కాబట్టి. చుట్టూ నేతలు - కార్యకర్తలు జన సందోహం ఉండడంతో వీరి ప్రేమకు అవకాశమే ఉండదు.

కానా ఉత్తరాధిలో మాత్రం ఓ ఎమ్మెల్యేల జంట ప్రేమలో పడింది. దేశంలోనే తొలిసారి ఓ రాజకీయ జంట ప్రేమించుకొని పెళ్లికి రెడీ అయ్యారు. ఇదో సంచలనమైన వార్తే. ఎంతో బిజీగా ఉండే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక్కటి కాబోతున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిథిసింగ్ - పంజాబ్ లోని షహీద్ భగత్ సింగ్ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ లు ఇద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారు. ఇద్దరూ మొన్నటి ఎన్నికల్లో తొలిసారి గెలిచిన వారే.. చూపులు చూపులు కలిసి మనుసులు కలవడంతో పెళ్లికి రెడీ అయ్యారు. తనకంటే నాలుగేళ్లు పెద్ద అయిన అతిథిని అంగద్ పెళ్లి చేసుకుంటుండడం విశేషం. నవంబర్ 21న జరిగే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వివాహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే జరుగుతున్న తొలి పెళ్లిగా అభివర్ణిస్తున్నారు.
Tags:    

Similar News