భారత సైన్యం కోసమంటూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్న రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారిపోయింది. రాఫెల్ విమానాల కొనుగోలు వివరాలు వెల్లడించబోమని కేంద్రం చెబుతుంటే... తమ హయాంలోనే మొదలైన ఈ డీల్ గురించి చెప్పమంటే కుదరంటూ యూపీఏ కూటమి... ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న వైనం ఈ వివాదాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేసిందని చెప్పక తప్పదు. మొత్తంగా గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఫ్యామిలీని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణం కంటే కూడా ఇప్పుడు రాఫెల్ వివాదం పరిణమించిందన్న వాదన వినిపిస్తోంది. గడచిన మూడు రోజులుగా పార్లమెంటు సమావేశాలను అట్టుడికిస్తున్న రాఫెల్ డీల్ గురించిన వాస్తవాల్లోకి ఓ సారి వెళి కాస్తంత నిశితంగా పరిశీలిస్తే... ఈ వివాదం నిజంగానే బోఫోర్స్ ను మించిన వివాదమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే... ఎప్పుడో 2001లో మొదలైన ఈ డీల్ ఇప్పుడు ఖరారు కావడం - గతంలో నిర్ణయించిన ధరకు దాదాపుగా మూడింతల మేర రేటు పెంచిన వైనం చూస్తుంటే... నిజంగానే ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కూడా అనుమానించక తప్పదు.
అంతేకాకుండా ఎప్పుడో 2001లో మొదలైన ఈ డీల్ ను యూపీఏ హయాంలో అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అధ్యక్షతన కీలక నిర్ణయాలు తీసుకోగా... ఇప్పుడు ఎన్డీఏ సర్కారులో రక్షణ రంగ ప్రతిష్ఠను ఇనుమడించేలా వ్యవహరించిన మాజీ రక్షణ మంత్రి - ప్రస్తుతం గోవా సీఎంగా ఉన్న మనోహర్ పారీకర్ హయాంలో తుది అంకానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ రక్షణ శాఖను వదిలి వెళ్లిన తర్వాత ఈ వివాదం రాజుకోవడం గమనార్హం. పారీకర్ రక్షణ మంత్రిగా ఉండగా... దేశ సైన్యానికి సరికొత్త జవసత్వాలు నింపే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో రక్షణ రంగ సత్తాను మరింతగా పెంచే దిశగానూ పారీకర్ చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా... వాటిని అమల్లోకి కూడా తీసుకొచ్చేశారు. పారీకర్ ఉన్నంత దాకా బాగానే కొనసాగిన రాఫెల్ డీల్ ఆ తర్వాతే వివాదాల సుడిలో చిక్కుకుందన్న వాదనా లేకపోలేదు. ప్రస్తుతం ఈ ఒప్పందం కుదిరిన కీలక తరుణంలో ఒకవేళ పారీకర్ ఉండి ఉంటే... రాఫెల్ డీల్ వివాదం అయ్యేదే కాదన్న వాదన కూడా వినిపిస్తోంది.
అయినా దేశ రాజకీయాలను ఒక్కసారిగా భారీ కుదుపునకు గురి చేసిన ఈ వివాదం గురించిన ప్రాధమిక వివరాల్లోకి వెళితే... యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ తో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్.. ఈ ఒప్పందంలో ఒక కీలక భాగస్వామిగా ఉండటం ఈ వివాదానికి మూలంగా చెప్పుకోవాలి. భారత వైమానిక దళం అదనపు యుద్ధ విమానాలు కావాలని 2001లో ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడున్న వాయుసేన విమానాలు.. భారీ లేదా తేలిక తరహా యుద్ధ విమానాలు కావటంతో మధ్రశ్రేణి యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని రక్షణశాఖ భావించింది. మధ్యశ్రేణి బహుళ ప్రయోజన యుద్ధ విమానాల కొనుగోలుకు 2007 ఏప్రిల్ లో నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం తెలిపింది. అప్పుడు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 126 యుద్ధ విమానాల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లు పిలిచారు. లాక్ హీడ్ మార్టిన్ F-16 - యూరోఫైటర్ టైఫూన్ - రష్యా MiG-35 - బోయింగ్ F/A-18 - స్వీడన్ సాబ్స్ గ్రిపెన్ - దసాల్ట్ ఏవియేషన్ రాఫెల్ జెట్ ఫైటర్ లు బిడ్లు వేశాయి. సుదీర్ఘ కాలం ప్రక్రియ కొనసాగిన తర్వాత.. 2012 డిసెంబర్ లో బిడ్లు తెరిచారు. అతి తక్కువ ధర కోట్ చేసిన దసాల్ట్ ఏవియేషన్ కు టెండర్ లభించింది.
రెండు ఇంజన్లు గల బహుళ ప్రయోజన యుద్ధ విమానం రాఫెల్ జెట్ ఫైటర్. ఫ్రాన్స్ లోని దసాల్ట్ ఏవియేషన్ దీనిని డిజైన్ చేసి తయారుచేసింది. ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానాల్లో రాఫెల్ ఒకటి. అప్పటి ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం 18 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ లో తయారు చేసి అందించాలి. మిగతా 108 యుద్ధ విమానాలను భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఏఎల్) భాగస్వామ్యంతో భారతదేశంలో తయారు చేయాలి. విమానం ధరలు, టెక్నాలజీ బదిలీల విషయంలో యూపీఏ ప్రభుత్వం - దసో మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. 2014 మే నెలలో యూపీఏ సర్కారు దిగిపోయేనాటికి తుది ఒప్పందం కుదరలేదు. ఆ చర్చల్లో రాఫెల్ ధర ఎంత అనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఆ ఒప్పందం విలువ 10.2 బిలియడ్ డాలర్ల ఉంటుందని నాటి యూపీఏ ప్రభుత్వం సూచించింది. ఏవియానిక్స్ - ఆయుధాలు సహా ఒక్కో విమానం ధర.. అప్పటి యూరో మారక విలువ ప్రకారం రూ. 526 కోట్ల మేర ఉండేలా సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ చెప్తోంది.
2014లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 ఏప్రిల్ లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్ – భారత్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా.. భారత్ 36 రాఫెల్ యుద్ధ విమానాలను నేరుగా కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అయితే.. భద్రత పై కేబినెట్ కమిటీ ఆమోదం లేకుండా ప్రధాని ఈ ఒప్పందాన్ని ఎలా ఖరారు చేస్తారని ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తింది. భారత ప్రధాని నరేంద్రమోదీ - నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలండ్ ల మధ్య చర్చల అనంతరం 2015 ఏప్రిల్ 10న ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత దేశానికి 36 రఫేల్ విమానాల సరఫరా కోసం రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరువురు అంగీకరించినట్లు ఆ ప్రకటన పేర్కొంది. యుద్ధ విమానంతో పాటు.. భారత వైమానిక దళం అంతకుముందే (యూపీఏ హయాంలోనే) పరీక్షించి ఆమోదించిన సంబంధిత వ్యవస్థలు, ఆయుధాలను సరఫరా చేస్తాయని తెలిపింది. 2016 సెప్టెంబర్ 23న ఇండియా – ఫ్రాన్స్ లు ఈ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. దీని ప్రకారం.. 36 రాఫెల్ జెట్ ఫైటర్ల ను 7.87 బిలియన్ యూరోల (సుమారు రూ. 59,000 కోట్లు)కు భారత్ కొనుగోలు చేస్తుంది.
ఈ ఒప్పందంలో భారీ అవకతవకలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. యూపీఏ సర్కారు ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లకు కొనుగోలు చేసేలా ఖరారు చేస్తే.. మోదీ ప్రభుత్వం ఒక్కో దానిని రూ. 1,670 కోట్లతో కొంటోందన్నది వాటిలో ఒకటి. విమానం ధరల వివరాలను వెల్లడించాలని.. ఒక్కో విమానం ధర రూ. 526 కోట్ల నుంచి రూ. 1,670 కోట్లకు ఎందుకు పెరిగిందో వివరించాలని కాంగ్రెస్ అడుగుతోంది. కానీ.. ఆ వివరాలను వెల్లడించటానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఇండియా – ఫ్రాన్స్ ల మధ్య 2008లో జరిగిన ఒక ఒప్పందంలోని గోప్యత నిబంధనను ఉటంకిస్తోంది. అయితే.. 2008లో ఇరు దేశాల మధ్య రక్షణ రంగ కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందం జరిగినపుడు భారత రక్షణ మంత్రిగా ఉన్న ఎ.కె.ఆంటోని.. రఫేల్ ఒప్పందంలో ధరల వివరాలను వెల్లడించటానికి ఆ గోప్యత నిబంధన నిరోధిస్తోందన్న మోదీ సర్కారు వాదన పూర్తిగా తప్పని అంటున్నారు. అరబ్ దేశమైన కతార్.. 2017లో 12 రఫేల్ యుద్ధ విమానాలను.. ఒక్కొక్కటి 108.33 మిలియన్ డాలర్ల (రూ. 694.80 కోట్లు) ధరకే కొనుగోలు చేసిందని కూడా కాంగ్రెస్ చెప్తోంది.
ఇక.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ను ఈ ఒప్పందం నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలని ప్రశ్నిస్తోంది. రాఫెల్ డీల్ ద్వారా రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ (ఆర్ డీఎల్)కు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. భారత్ కు యుద్ధ విమానాల సరఫరా ఒప్పందాన్ని అమలు చేయటానికి దసాల్ట్ ఏవియేషన్.. రిలయన్స్ డిఫెన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. 2015 ఏప్రిల్ 10వ తేదీన ప్రధాని మోదీ రాఫెల్ డీల్ ఖరారైనట్లు ప్రకటన చేయటానికి కేవలం 12 రోజుల ముందే రిలయన్స్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఆరోపణలను ఆర్ డీఎల్ తిరస్కరించింది. భారత విధానం ప్రకారం.. విదేశీ రక్షణ రంగ సంస్థలు.. భారత్ నుంచి పొందే కాంట్రాక్టుల మొత్తం విలువలో కనీసం 30 శాతం నిధులను భారతదేశంలోని కంపెనీల నుంచి విడిభాగాలను కొనుగోలు చేయటం ద్వారా కానీ.. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను స్థాపించటం ద్వారా కానీ వెచ్చించాల్సి ఉంటుంది. రిలయన్స్ డిఫెన్స్, దసో ఏవియేషన్ లు.. 2016 అక్టోబర్ 3న తమ జాయింట్ వెంచర్ ’దసాల్ట్ రిలయన్స్ ఏవియేషన్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ తర్వాత ఏడాదికి నాగ్‌పూర్ లోని మిహాన్ లో తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫ్రాన్స్ పర్యటన తర్వాత రఫేల‌్ డీల్ విషయంలో విమర్శలు, ఆరోపణలను తీవ్రం చేశారు. మోదీ సర్కారు పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలోనూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలండ్ ‘మీడియా పార్ట్’ అనే ఫ్రెంచ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు మాట్లాడారు. రిలయన్స్ సంస్థను ‘‘ఎంపిక చేసే విషయంలో మా పాత్ర ఏమీ లేదు. ఆ సర్వీస్ గ్రూప్ (రిలయెన్స్ డిఫెన్స్)ను భారత ప్రభుత్వమే ప్రతిపాదించింది. అంబానీతో దసాల్ట్ చర్చలు జరిపింది. మాకు వేరే దారి లేదు. మాకు ఇచ్చిన వారిని (రిలయెన్స్ ను) మేం తీసుకోవాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పారు. ఈ మాట భారత రాజకీయాల్లో పెను దుమారం రేపింది. రఫేల్ డీల్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. కానీ.. హోలండ్ ఈ మాట చెప్పటం వెనుక వేరే నేపథ్యముంది. అది.. ఆయన భాగస్వామి, ఫ్రెంచ్ నటి జూలీ గయే సహ నిర్మాతగా నిర్మిస్తున్న ఒక సినిమా వివాదం.
2016లో జూలీ గయే సహ నిర్మాతగా మార్కో సిఫ్రెడీ అనే ఒక యువ పర్వతారోహకుడి కథతో ‘రైట్ ఆన్ ద టాప్’ అనే సినిమా తీయాలనుకున్నారు. 2002లో ఎవరెస్ట్ పర్వతం మీద స్నోబోర్డ్ రన్ చేస్తూ చనిపోయిన అతడి పాత్రను నటుడు కెవ్ ఆడమ్స్ చేయాలి. దీనికి 10 మిలియన్ యూరోల బడ్జెట్ అనుకున్నారు. 2016 జనవరిలో జూలీ గయే భాగస్వామ్యంతో కీవ్ ఆడమ్స్ హీరోగా సినిమా తీస్తున్నట్లు.. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ అధినేత అనిల్ అంబానీ ప్రకటించారు. ఆ సినిమాలో రిలయన్స్ పెట్టుబడి 30 లక్షల యూరోలు. ఆ తర్వాత దానిని 16 లక్షల యూరోలకు తగ్గించారు. అదే రోజు.. నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలండ్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. రాఫెల్ డీల్ ను ఖరారు చేసుకోవటానికి.. భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటానికి ఆయన వచ్చారు. రఫేల్ డీల్ కోసమే రిలయన్స్ సంస్థ జూలీ గయే సినిమాలో పెట్టుబడులు పెట్టిందన్న విమర్శలను హోలండ్ తాజాగా తిరస్కరించారు. ఆ క్రమంలోనే.. రిలయన్స్ సంస్థను ఎంపిక చేయటంలో తమ పాత్ర లేదని.. భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని చెప్పారు.
ఇలా ఏళ్ల తరబడి సాగిన తంతును ఇప్పుడు సాంతంగా తవ్వి తీస్తున్న రాహుల్ గాంధీ... దీని పై చాలా బలంగానే వాదనలు వినిపిస్తున్నారు. చివరగా... ఈ డీల్ కు సంబంధించిన అసలు సిసలు ఫైల్... రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించి ఇప్పుడు గోవా సీఎంగా ఉన్న పారీకర్ వద్ద భద్రంగా ఉందని, ఆ ఫైల్ బయటకు వస్తే... రాఫెల్ డీల్ కు సంబంధించిన సమగ్ర వివరాలు బయటకు వస్తాయని నిన్న రాహుల్ బాంబు లాంటి వార్తను పేల్చారు. ఈ ఆరోపణ విన్నవెంటనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన మోదీ సర్కారు... ఈ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలా? అన్న కోణంలో తనదైన వ్యూహాలకు పదును పెడుతోంది. మొత్తంగా ఈ వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా బోఫోర్స్ వివాదంతో గాంధీ ఫ్యామిలీ పై ఎంత మేర మచ్చ పడిందో రాఫెల్ వివాదం కూడా మోదీ నిజాయతీని అంతకంటే కాస్తంత ఎక్కువ మోతాదులోనే దెబ్బ తీసిందని చెప్పాలి.
Full View