వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎంతటి పిరికి వ్యక్తో తాజాగా బయటపడింది. రాజద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఇతర రంగాల్లోని ప్రముఖుల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా రద్దుచేయాలని వివిధ రంగాల్లోని ప్రముఖులు సుప్రింకోర్టులో కేసులు వేశారు. దానిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.
ఎంతమంది ప్రముఖులు రాజద్రోహం చట్టం 124 ఏ రద్దు కోరుతున్నా నరేంద్ర మోడీ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి 1880లో తయారైన ఈ చట్టం రద్దుకే సుప్రీంకోర్టు కూడా మొగ్గు చూపుతున్నది.
కేంద్రం స్పందన చూసిన తర్వాత సుప్రీం ఏకపక్షంగా చట్టం అమలుపై స్టే విధించింది. కేసు ఫైనల్ అయ్యేంతవరకు ఎవరిపైనా రాజద్రోహం చట్టంకింద కేసులు పెట్టద్దని ఆదేశించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 13 వేల మందిపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఇదే విషయమై రఘురాజు మాట్లాడుతు తనపై రాజద్రోహం కేసు నమోదుచేసిన జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు అధికారులకు పెద్ద గుణపాఠమన్నారు. తానుకూడా ఈ కేసు బాధితుడే అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఈ చట్టాన్ని రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం.
సుప్రీంకోర్టు చట్టాన్ని రద్దు చేయాలంటే మోడీ సర్కార్ కుదరదంటోంది. అంటే రాజద్రోహం చట్టం రద్దును కేంద్రం తిరస్కరిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎంపీ వ్యతిరేకించాల్సింది జగన్ ను మాత్రమే కాదు, నరేంద్రమోడి సర్కార్ వైఖరిని కూడా.
చట్టం అమలుపై స్టే ఇచ్చిన సుప్రింకోర్టును అభినందిస్తునే రాష్ట్రప్రభుత్వానికి గుణపాఠమన్నారు. అంతేకానీ చట్టం రద్దును వ్యతిరేకిస్తున్న మోడి సర్కార్ గురించి మాట్లాడటానికి ఎంపీ ధైర్యం చేయటంలేదు. చట్టం రద్దు చేయాలని మోడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయచ్చుకదా.
అలాగే చట్టం రద్దుకు ఇతర ప్రముఖుల్లాగే ఎంపీ కూడా ఎందుకు సుప్రింకోర్టులో కేసు వేయలేదు ? జగన్ కు వ్యతిరేకంగా హైకోర్టులో అనేక కేసులు వేస్తున్న ఎంపీ కేంద్రానికి వ్యతిరేకంగా కేసు దాఖలు చేయటానికి ఎందుకు వెనుకాడుతున్నారు. అంటే మోడీ మద్దతు ఎంపీగా ఉన్నట్టే అనిపిస్తోంది. బీజేపీతో ఎంపీకి బాగా సఖ్యత ఉన్నట్టుంది.