హైదరాబాద్ లోని అమ్మేషియా పబ్ లో పార్టీకి వెళ్లి అనంతరం కారులో గ్యాంగ్ రేప్ నకు గురైన బాలిక కేసు మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడు లేడని చెప్పిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బయటకొచ్చారు. పక్కా ఆధారాలు బయటపెట్టారు. ఆరోజు వారు తీసుకున్న ఫొటోలు, వీడియోలను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
అమ్మేషియా పబ్ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేసిన అనంతరం రఘునందన్ రావు మాట్లాడారు. నిందితుల అరెస్ట్ ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారులు మీడియాను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు నిందితుల వైపా? బాధితుల వైపా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని భయపెట్టండి అని అన్నారు. విచారణ పూర్తికాకముందే కొందరికీ క్లీన్ చిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్ గా ఉంచారని ప్రశ్నించారు. అధికార పార్టీ, డబ్బున్న వారి పిల్లలనే ఫొటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు. నిందితులను ఎందుకు అరెస్ట్ చూపడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ చేతిలో పోలీస్ కంట్రోలింగ్ ఉందని ఆరోపించారు.
ఎంఐఎం వాళ్లను కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ కలర్ మెర్సిడేజ్ కారులో ఉన్న వ్యక్తులను నిందితులుగా చేర్చుకుండా వెనుకాల ఇన్నోవాలో ఉన్న వారిని నిందితులుగా చేర్చడం బాధాకరమని అన్నారు. ఇన్నోవా కారులో ఉన్న వారిని ముద్దాయిలుగా చేస్తున్నారని.. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతామని అన్నారు.
అత్యాచారం జరిగిన రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని రఘునందన్ రావు ఆరోపించారు. కారులో ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయని.. కానీ వీటిని ప్రపంచానికి ఎంతవరకూ చూపించాలో తనకు తెలుసు అని కొద్దిగా మాత్రమే మీడియా ముందు చూపించి వారి ముఖాలు కనపడకుండా రఘునందన్ రావు ప్రదర్శించారు. ఈ ఫొటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా? అని ప్రశ్నించారు.
హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన దగ్గర ఉన్న ఇతర ఆధారాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు, న్యాయస్థానాలకు అందజేస్తామని తెలిపారు.
Full View