ఒక ప్రకటన ప్రకంపనలు స్రష్టిస్తుంది. ఒక ప్రకటన కొందరికి ఆలంబన అవుతుంది. ఒక ప్రకటన కొన్ని జీవితాలను నిలబెడుతుంది. ఒక ప్రకటన వైరి పక్షాలకు ఆస్త్రమూ అవుతుంది. తెలంగాణ మంత్రి తన్నీర్ హరీష్ రావ్ చేసిన ఓ ప్రకటన కూడా ఇప్పుడు అలాంటి ప్రకంపనలే సృష్టిస్తోంది. మంత్రి హరీష్ రావ్ తాను దత్తత తీసుకున్న తన నియోజకవర్గంలోని ఇబ్రహింపూర్ లో జరిగిన తన సన్మాన కార్యక్రమంలో చేసిన ప్రకటనే ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... ఇబ్రహింపూర్ గ్రామస్తులు తనపై చూపిన అభిమానానికి పొంగిపోయిన హరీష్ రావు తన జన్మకు ఇది చాలునని - ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నా చాలు అని ఉద్వేగంగా అన్నారు. ఈ మాటలంటున్నప్పుడు హరీష్ రావు తన కళ్లలో నీళ్లు కూడా తిరిగాయట. సరే, ఇదంతా పక్కన పెడితే హరీష్ రావు ఇలాంటి ప్రకటన చేయడం వెనుక పెద్ద కథే ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కొన్నాళ్లు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కలిసి పని చేసిన వారైతే దీనివెనుక పెద్ద కుట్రే ఉందని అంటున్నారు.వంచనకు మారు పేరైన కె.చంద్రశేఖర రావు తన మేనల్లుడు - మంత్రి తన్నీరు హరీష్ రావును బయటకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారని, ఈ విషయం తెలిసిన హరీష్ రావు మదనపడుతూ రాజకీయాలు చాలు అనే స్ధాయికి వచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి - దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన రావు విమర్శిస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గత కలహాలు పెరగుతున్నాయని, తన కుమారుడి కోసం హరీష్ రావును బలి చేసేందుకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్కేచ్ వేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ సారి సిద్ధిపేట నుంచి కె.చంద్రశేఖర రావు పోటీ చేయనున్నట్లు తమకు సమాచారం ఉందని - దీని కారణంగా హరీష్ రావును పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారని రఘునందన రావు అంటున్నారు. ఈ కుట్రకు చాలాకాలంగా పునాదులు పడ్డాయని, ఇందులో భాగంగానే అనుంగు అనుచరుడు సంతోష్ ను రాజ్యసభకు పంపించారని కూడా అంటున్నారు. మొత్తానికి హరీష్ రావు ఉద్వేగంగా చేసిన ఓ ప్రకటన తెలంగాణ రాజకీయాలను... ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో కాకా పుట్టిస్తోంది.