2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందారు.. రఘరామకృష్ణరాజు. ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీతో విభేదించి రెబల్ ఎంపీగా మారారు. నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ రఘురామకృష్ణరాజు సోషల్ మీడియా, మీడియా, యూట్యూబ్ చానెళ్ల ఇంటర్వ్యూల్లో తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా రచ్చబండ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగడుతున్నారు.
ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం రఘురామను సీఐడీ పోలీసుల చేత అరెస్టు చేయించింది. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.. సీఐడీ పోలీసులు. ఆయనను అప్పుడు ఏపీకి తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనను కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో రఘురామ నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు.
మరోవైపు రఘురామ కృష్ణరాజు అసమ్మతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని, ఆయనను లోక్ సభ సభ్యత్వం నుంచి తొలగించాలి వైసీపీ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.
అయినా సరే రఘురామ వెనక్కి తగ్గడం లేదు. తన విమర్శలను మరింత పెంచారు. ఏకంగా జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధానికి రఘురామ లేఖ రాశారు.
ఈ లేఖలో సీఐడీ పోలీసులు తనను అరెస్ట్ చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ ఆరోపించారు. తన ను కొట్టిన విచారణ అధికారులను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఇంకా పిలవలేదని ఆ లేఖలో మోడీ దృష్టికి తెచ్చారు పేర్కొన్నారు. తనను ఎవరు కొట్టారో ఇంకా విచారణే జరపలేదని గుర్తు చేశారు. ఈ అంశంపై త్వరగా విచారణ జరిపించాలని ప్రధానికి విన్నవించారు. తనను సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ కొట్టారని, ముఖ్యమంత్రి జగన్ వీడియో ద్వారా దానిని చూశారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై విచారణ జరిపించాలని విన్నవించారు.
కాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై రఘురామ మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించరు కానీ ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేసే వారికి మాత్రం జీతాలను పెంచుతారని చెబుతున్నారని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్లకు ఇచ్చినట్లు ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేసేవారికి కూడా అవార్డులను ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని జగన్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈనెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశానన్నారు. తాను గత ఎన్నికల్లో జగన్ ఫొటో పెట్టుకుని గెలవలేదని.. తన ఫొటో పెట్టుకునే గెలిచానన్నారు.