ప్రతిరోజు ఏదో అంశంపై ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం లేకపోతే విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నట్లుంది ఈ తిరుగుబాటు ఎంపీ. ప్రభుత్వం మీద చేయటానికి ప్రత్యేకంగా ఆరోపణలు, విమర్శలు లేకపోతే ఇతర పార్టీలు చేసే ఆరోపణలు, విమర్శలనే తిరిగి తన ప్రభుత్వంపై చేస్తుంటారు. ఇదంతా ఎవరి గురించంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించే. తాజాగా ఆయన చేసిన ఆరోపణలు ఏమిటంటే తన కుటుంబాన్ని కిడ్నాప్ చేయటానికి రెక్కీ జరిగిందట.
ఇంతకీ ఆయన కుటుంబం ఎక్కడుంటోంది ? నరసాపురంలోనా ? లేకపోతే హైదరాబాద్ లోనా ? అదీకాకపోతే ఢిల్లీలోనా ? కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు రెక్కీ జరిగిందని మాత్రమే చెప్పిన రాజుగారు ఆ రెక్కీ ఎక్కడ జరిగింది ? రెక్కీ జరిగిన ఇంట్లో తన కుటుంబసభ్యుల్లో ఎవరుంటున్నారు ? అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఎంపీ ఇల్లు ఎక్కడున్నప్పటికీ ఆ ఇంటి ముందు ప్రతిరోజు ఎంతోమంది రాకపోకలు సాగిస్తుంటారు. మరి ప్రత్యేకంగా రెక్కీ నిర్వహించారని అది తన కుటుంబసభ్యులను కిడ్నాప్ చేయటానికే అని ఎంపీ ఎలా చెప్పగలరు ?
ఇక్కడ విషయం ఏమిటంటే ఏదో ఓ అంశాన్ని పట్టుకోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్న అజెండా తప్ప ఇంకేమీ కనబడటంలేదు. తాను ఏమి మాట్లాడినా అచ్చేసే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా ఉంది కాబట్టి రాజుగారి ఆటలు సాగుతున్నాయి. ఎంపీ కుటుంబంలో ఎవరిని ? ఎందుకని కిడ్నాప్ చేస్తారు ? కిడ్నాప్ భయం ఎవరికుంది ? ఎవరినుంచుంది ? అన్న విషయాలను ఎంపీ చెప్పలేదు. పైగా అన్ని ఆధారాలతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారట.
మరి హోంశాఖకు చేసిన ఫిర్యాదు కాపీలనే మీడియాకు ఇవ్వచ్చు కదా ? మళ్ళీ ఆ కాపీలను మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే నిజంగానే ఫిర్యాదు చేసుంటే ఆ ఫిర్యాదులోని అంశాలు బయటకు వస్తాయన్న ఉద్దశ్యంతోనే మీడియాకు ఇవ్వలేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే తనను డీజీపీ అడిగితే కిడ్నాప్ రెక్కీ వివరాలు ఇస్తారట. అవసరం ఎవరిది ? ఎంపీదా లేకపోతే డీజీపీ దా ? అవసరం అనుకుంటే తానే డీజీపీతో మాట్లాడి ఫిర్యాదు వివరాలను అందించాలి. అంతేకానీ ఎంపీ దగ్గరకు వచ్చి, మాట్లాడి ఫిర్యాదు తీసుకోవాల్సిన అవసరం డీజీపీకి ఏముంది ?
ఏమిటో ఎంపీ వ్యవహారం రోజురోజుకు ఇలాగైపోతోంది. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని మీడియాలో ప్రభుత్వంపై బురదచల్లేయటానికి టైం టేబుల్ వేసుకున్నట్లున్నారు. అందుకనే కిడ్నాప్ రెక్కీ అని, రైతుల పాదయాత్రను భగ్నం చేయటానికి ప్రభుత్వం కృత్రిమ దాడులను సృష్టిస్తోందని, అరెస్టులు చేయిస్తుందంటు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పాదయాత్రకు కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రభుత్వం ఎలా ఆపుతుందన్న కనీస ఆలోచన కూడా ఎంపీలో కనబడటంలేదు. ఏమిటో రాజుగారు ఇలాగైపోతున్నారు.